వర్క్ ఫ్రం హోమ్:  ఉద్యోగులకు తీపి కబురు

ప్రముఖ సాఫ్ట్‌ వేర్‌‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ నేపథ్యంలో ఇప్పటికే ఎంప్లాయిస్‌కు వర్క్‌ హోమ్‌  ఇచ్చింది. ఉద్యోగుల పనితీరుకు సంబంధించి శుక్రవారం మరో కీలక ప్రకటన చేసింది. ఇకపై శాశ్వతంగా అదే విధానాన్ని కొనసాగించే ప్రత్యామ్నాయాన్ని వారి ముందు పెట్టింది. అయితే.. ఇది అన్ని రకాల ఉద్యోగులకు వర్తించదని స్పష్టం చేసింది. Also Read: భారత్ లో కొత్త టెక్నాలజీ.. 30 సెకన్లలో కరోనా ఫలితం..! హార్డ్‌వేర్‌‌ ల్యాబ్స్‌, డేటా సెంటర్లు, శిక్షణా […]

Written By: NARESH, Updated On : October 10, 2020 5:06 pm
Follow us on


ప్రముఖ సాఫ్ట్‌ వేర్‌‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ నేపథ్యంలో ఇప్పటికే ఎంప్లాయిస్‌కు వర్క్‌ హోమ్‌  ఇచ్చింది. ఉద్యోగుల పనితీరుకు సంబంధించి శుక్రవారం మరో కీలక ప్రకటన చేసింది. ఇకపై శాశ్వతంగా అదే విధానాన్ని కొనసాగించే ప్రత్యామ్నాయాన్ని వారి ముందు పెట్టింది. అయితే.. ఇది అన్ని రకాల ఉద్యోగులకు వర్తించదని స్పష్టం చేసింది.

Also Read: భారత్ లో కొత్త టెక్నాలజీ.. 30 సెకన్లలో కరోనా ఫలితం..!

హార్డ్‌వేర్‌‌ ల్యాబ్స్‌, డేటా సెంటర్లు, శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనే ఉద్యోగులకు తప్పనిసరిగా ఆఫీసులకు రావాల్సి ఉంటుందని చెప్పింది. సగం లేదా అంతకంటే తక్కువ పనిదినాల్లో మాత్రమే ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు ఇచ్చింది. దీనిపై ఆయా విభాగాల మేనేజర్లతో ఉద్యోగులు చర్చించి నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించింది.

ఇంటి నుంచి పనిచేసే వారు తమ నివాస స్థలాలను కూడా మార్చుకోవచ్చని సూచించింది. అమెరికాలో వారి సొంత ప్రదేశాలకు లేదా విదేశీయులు తమ సొంత దేశాలకు కూడా వెళ్లి వర్క్‌ చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. అయితే.. ఇక్కడ ఓ తిరకాసు కూడా పెట్టింది. ఆయా వర్క్‌ ప్లేసులను బట్టి జీతభత్యాలు ఉంటాయని స్పష్టం చేసింది. దీనికి మేనేజర్‌‌ అనుమతి తప్పనిసరి అని తెలిసింది. అయితే.. కరోనా ఆంక్షలు పూర్తిగా తొలగించిన తర్వాత ఆఫీసు పనివేళల్లోనూ మార్పులుండే అవకాశం ఉందని సంకేతాలిచ్చింది.

Also Read: బిర్యానీ ఐడియా అతని జీవితాన్నే మార్చేసింది.. ఎలా అంటే..?

ఇప్పటికే చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీలు వర్క్‌ ఫ్రం హోమ్ శాశ్వత ప్రాతిపదికను అమలు చేస్తున్నాయి. ఫేస్‌బుక్‌లోని ఉద్యోగుల్లో సగానికి పైగా మంది రాబోయే ఐదు నుంచి పదేళ్ల వరకు ఇంటి నుంచే వర్క్‌ చేయనున్నట్లు ఆ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ట్విట్టర్‌‌, స్క్వేర్‌‌ తాజాగా మైక్రోసాఫ్ట్‌ కూడా అదే విధానాన్ని అనుసరించనున్నాయి. మైక్రోసాఫ్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఆలోచనలతో ఎంప్లాయిస్‌ హ్యాపీగా ఉన్నారు. విదేశీయులు స్వదేశానికి వెళ్లి కూడా వర్క్‌ చేసుకోవచ్చని చెప్పడంతో.. మరి ఎంత మంది స్వదేశానికి వస్తారో చూడాలి.