రాజమౌళి పై ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఫిర్యాదులు !

నేషనల్ రేంజ్ లోనే గొప్ప విజువల్ డైరెక్టర్ గా తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న రాజమౌళి మీద ఎవరైనా అతని డైరెక్షన్ విషయంలో ఫిర్యాదు చేస్తారా.. చెయ్యరు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ జక్కన్న పై వరుస ఫిర్యాదులతో మోత మోగించారు. ఈ రోజు దర్శక ధీరుడు రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా సినిమా యూనిట్టే రాజమౌళి పై కంప్లైంట్స్ చేస్తూ ఊహించని విధంగా ట్రీట్ ఇచ్చారు. ఒక్కో టెక్నిషియన్స్ ఒక్కో కంప్లైంట్ రైజ్ చేస్తూ రాజమౌళితో తమ […]

Written By: admin, Updated On : October 10, 2020 4:13 pm
Follow us on


నేషనల్ రేంజ్ లోనే గొప్ప విజువల్ డైరెక్టర్ గా తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న రాజమౌళి మీద ఎవరైనా అతని డైరెక్షన్ విషయంలో ఫిర్యాదు చేస్తారా.. చెయ్యరు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ జక్కన్న పై వరుస ఫిర్యాదులతో మోత మోగించారు. ఈ రోజు దర్శక ధీరుడు రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా సినిమా యూనిట్టే రాజమౌళి పై కంప్లైంట్స్ చేస్తూ ఊహించని విధంగా ట్రీట్ ఇచ్చారు. ఒక్కో టెక్నిషియన్స్ ఒక్కో కంప్లైంట్ రైజ్ చేస్తూ రాజమౌళితో తమ ఇబ్బందులను చెప్పుకొచ్చారు. ఎమ్.ఎమ్ కీరవాణి తన పనికి సంబంధించి రాజమౌళితో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో చెప్పాడు. పాటలో పల్లవి ఒక నెలలో పూర్తి అయితే, ఇక చరణం ఇంకో మూడు నెలలు తరువాత పూర్తవుతుందని.. అలాగే రికార్డింగ్ ఆ తర్వాత ఏడాదినే అవుతుందని.. తీరా అప్పటికి ఆ పాట అసలు ఏ సినిమాలోదో, అసలు ఎందుకు చేసామో కూడా మర్చిపోతాం అని కీరవాణి సరదాగా తెలిపాడు.

Also Read: అనుష్కకు నో చెప్పిన జక్కన్న.. అలియాకు ఓకే అంటాడా?

కాగా చరణ్, తారక్ ల విషయానికి వస్తే.. తారక్ చెబుతూ.. తనతో సరిగ్గా కష్టమైన షాట్ ఏం లేదు వెళ్ళిపోదాం అని, సెట్స్ కి వెళ్ళాక ఒక షాట్ చెప్తాడు. అది అన్ని షాట్స్ కంటే కష్టంగా ఉంటుంది. పైగా దాన్ని రీటేక్ లు చేయించి చేయించి ఒక్క షాట్ ని మూడు గంటలు చేస్తాడు, ఒకసారి అయితే ప్యాకప్ చెప్పడానికి తెల్లారుజాము 4:30 అయింది. ఇక చరణ్ వంతుకు వస్తే.. ఒక యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారు. సడెన్ గా వచ్చి ఒక 40 అడుగులు నుంచి రోల్ అవుతూ కిందకి పడే అదిరిపోయే షాట్ చూపిస్తారు. తీరా అది ఎవరు చేస్తారు అని అడిగితే ఇంకెవరు చేస్తారు నువ్వే అని చివరకు తనకు నచ్చినట్లు చేయించేస్తాడు. ఈ బర్త్ డేకు రాజమౌళికి టీం మొత్తానికి డిఫరెంట్ గిఫ్ట్ ఇచ్చారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత జక్కన్న చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై ఆరంభం నుండి భారీ అంచనాలు భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో నెలకొన్నాయి.