అనుష్కనే కావాలి.. ఆ దర్శకుడికి ఫ్యాన్స్ రిక్వెస్ట్..! 

దర్శకుడు గుణశేఖర్ చాలా రోజుల గ్యాప్ తర్వాత ఓ మూవీ చేయబోతున్నాడు. గుణశేఖర్ చివరగా తెరకెక్కించిన చిత్రం రుద్రమదేవి 2015లో రిలీజైంది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగానే అలరించింది. అయినప్పటికీ ఈ సినిమా తర్వాత గుణశేఖర్ కొత్త సినిమాలేవీ చేయకపోవడం గమనార్హం. Also Read: రాజమౌళి పై ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఫిర్యాదులు ! తాజాగా దర్శకుడు గుణశేఖర్ అందరినీ సర్ ప్రైజ్ చేస్తూ ‘శాకుంతలం’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాడు. అద్భుతమైన ప్రేమకావ్యంతో గుణశేఖర్ ప్రేక్షకులకు […]

Written By: NARESH, Updated On : October 10, 2020 5:13 pm
Follow us on

దర్శకుడు గుణశేఖర్ చాలా రోజుల గ్యాప్ తర్వాత ఓ మూవీ చేయబోతున్నాడు. గుణశేఖర్ చివరగా తెరకెక్కించిన చిత్రం రుద్రమదేవి 2015లో రిలీజైంది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగానే అలరించింది. అయినప్పటికీ ఈ సినిమా తర్వాత గుణశేఖర్ కొత్త సినిమాలేవీ చేయకపోవడం గమనార్హం.

Also Read: రాజమౌళి పై ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఫిర్యాదులు !

తాజాగా దర్శకుడు గుణశేఖర్ అందరినీ సర్ ప్రైజ్ చేస్తూ ‘శాకుంతలం’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాడు. అద్భుతమైన ప్రేమకావ్యంతో గుణశేఖర్ ప్రేక్షకులకు ముందుకు రాబోతుందటం విశేషం. ఈ మోషన్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. మోషన్ పోస్టర్ తోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ మోషన్ పోస్టర్ ను గుణశేఖర్ ట్వీటర్లో రిలీజ్ చేశాడు. మహాభారతంలోని ఆదిపర్వం ఆధారంగా ‘శాకుంతలం’ మూవీని తెరకెక్కించనున్నట్లు దర్శకుడు గుణశేఖర్ ప్రకటించాడు. ఈ మోషన్ పోస్టర్ చూసిన వారంతా ‘శాకుంతలం’ మోషన్ పోస్టర్ అద్భుతమని కితాబిస్తున్నారు.

మరోవైపు ఈ సినిమాలో అనుష్కను హీరోయిన్ గా తీసుకోవాలని అనుష్క ఫాన్స్ దర్శకుడు గుణశేఖర్ కు రిక్వెస్ట్ చేస్తున్నారు. శకుంతలదేవీ పాత్రకు అనుష్కనే న్యాయం చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్లో హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలకు అనుష్క కేరాఫ్ అడ్రస్ గా మారింది. ‘అరుంధతి’..‘భాగమతి’.. ‘దేవసేన’గా అనుష్క అభిమానులను అలరించింది. గతంలోనూ వీరిద్దరి కాంబినేషన్లో ‘రుద్రమదేవి’ వచ్చింది. ఈ సినిమా ఘనవిజయం సాధించింది.

Also Read: ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలను లైన్లో పెట్టిన త్రివిక్రమ్..!

మరోవైపు ‘నిశబ్ధం’ మూవీ తర్వాత అనుష్క ఏ సినిమాకు కమిట్ కాకపోవడంతో ఈ సినిమాకు అంగీకరించాలని ఆమె అభిమానులు కోరుతున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి మ్యూజికల్ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.