Women’s Reservation Bill: నూతన పార్లమెంట్ భవనంలో తొలి బిల్లు మహిళా రిజర్వేషన్‌దే పెట్టి ఆమోదించాలని కేంద్రం పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో కొత్త భవనంలోకి వచ్చిన వెంటనే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, తర్వాత ప్రధాని మోదీ ప్రసంగించారు. తర్వాత లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు రేపు లేదా ఎల్లుండి ఉభయ సభల్లో ఆమోదం పొందే అవకాశం ఉంది. దీంతో తెలంగాణలో మహిళా రిజర్వేషన్ అమలు అయితే ఏయే సీట్లు మారతాయన్న చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా, మహిళా రిజర్వేషన్ల అమలు ప్రస్తుతం ఉండకపోవచ్చని, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతనే అమలు చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే బిల్లు ఆమోదించడం ఖాయం. అమలుపై మాత్రమే సందిగ్ధం ఉంది. ఈ క్రమంలో తెలంగాణలో పరిస్థితిపై సోషల్ మీడియాలో పోస్టులు చెక్కర్లు కొడుతున్నాయి.
తెలంగాణలో 119 సీట్లు..
ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో 119 స్థానాలు ఉన్నాయి. వాటిలో 33 శాతం సీట్లు అంటే సుమారు 40 స్థానాల్లో మహిళలు ప్రాతినిధ్యం వహించాలి. తెలంగాణ అసెంబ్లీలో తాజా లెక్కల ప్రకారం 63 స్థానాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మహిళలను రిజర్వ్ చేసేందుకు దీన్నే ప్రాతిపదికగా తీసుకుంటే సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్వర్ రెడ్డి, టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ సీనియర్ నేతలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు తదితరులు తమ స్థానాలను మార్చుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో మెజార్టీ స్థానాల్లో మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ స్థానాలను మహిళలకు కేటాయించాల్సి వస్తే, ప్రధాన పార్టీల్లోని సీనియర్లు ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తుంది. మహిళా ఓటర్ల జాబితా ప్రకారం మహిళలకు కేటాయిస్తే తెలంగాణలో మారే స్థానాలు ఇవే..
పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు..
ఆదిలాబాద్ 114016 (జోగు రామన్న)
బోథ్(ఎస్టీ) 102576 (అనిల్ జాదవ్)
ఖానాపూర్(ఎస్టీ) – 104537 (భూక్య జాన్సన్ రాథోడ్ నాయక్)
నిర్మల్ – 122696 (ఇంద్రకరణ్‌రెడ్డి)
ముధోల్ – 119092 (విఠల్ రెడ్డి)
ఆర్మూర్ – 105657 (ఆశన్న గారి జీవన్‌రెడ్డి)
బోధన్ – 106222 (మహ్మద్ షకిల్ అహ్మద్)
బాన్సువాడ – 94941 (పోచారం శ్రీనివాస రెడ్డి)
నిజామాబాద్ అర్బన్– 138615(బిగాల గణేశ్ గుప్త)
నిజామాబాద్ రూరల్ – 127602 (బాజిరెడ్డి గోవర్ధన్)
బాల్కొండ – 111424 (వేముల ప్రశాంత్ రెడ్డి)
జుక్కల్(ఎస్సీ) – 95512 (హన్మంత్ షిండే)
ఎల్లారెడ్డి – 107603(జాజుల సురేందర్)
కామారెడ్డి – 117783(కేసీఆర్)
కోరుట్ల – 116536 (డా. సంజయ్ కల్వకుంట్ల)
జగిత్యాల – 109853 (డా. ఎం.సంజయ్ కుమార్)
ధర్మపురి(ఎస్సీ)– 107068 (కొప్పుల ఈశ్వర్)
మంథని – 110840 (పుట్టా మధు)
పెద్దపల్లి – 120120 (దాసరి మనోహర్‌రెడ్డి)
చొప్పదండి(ఎస్సీ)– 116006 (సుంకే రవి శంకర్)
మానకొండూర్(ఎస్సీ)– 107087 (రసమయి బాలకిషన్)
హుజూరాబాద్ – 119632 (పాడి కౌశిక్‌రెడ్డి)
వేములవాడ – 107839 (చల్మెడ లక్ష్మీ నరసింహారావు)
సిరిసిల్ల – 116066 (కేటీఆర్)
ఆంధోల్(ఎస్సీ) – 114077 (చంటి క్రాంతి కిరణ్)
సంగారెడ్డి – 107750 (చింతా ప్రభాకర్)
మెదక్ – 105075 (ఎం. పద్మా దేవేందర్‌రెడ్డి)
నర్సాపూర్ – 104712 (పెండింగ్)
హుస్నాబాద్ –114218 (వొడిదెల సతీశ్ కుమార్)
సిద్ధిపేట – 109938 (హరీశ్ రావు)
దుబ్బాక – 95375 (కొత్త ప్రభాకర్ రెడ్డి)
గజ్వేల్ – 126814 (కేసీఆర్)
తాండూర్ – 111529 (పైలెట్ రోహిత్ రెడ్డి)
కొడంగల్ – 108157 (పట్నం నరేందర్ రెడ్డి)
దేవరకొండ – 107951 (రవీంద్ర కుమార్ రమావత్)
గద్వాల – 118447 (బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి)
అలంపూర్(ఎస్సీ)– 111439 (వీఎం.అబ్రహం)
నాగార్జున సాగర్ – 109992 (నోముల భగత్)
మిర్యాలగూడ – 107265 (నల్లమోతు భాస్కర్ రావు)
నల్లగొండ – 114211 (కంచర్ల భూపాల్ రెడ్డి)
హుజూర్ నగర్ – 117299 (సైదిరెడ్డి)
కోదాడ – 114706 (బొల్లం మల్లయ్య యాదవ్)
సూర్యపేట – 113049 (జగదీశ్ రెడ్డి)
జనగామ – 110512 (పెండింగ్)
ఘన్‌పూర్ స్టేషన్(ఎస్సీ)– 117439 (కడియం శ్రీహరి)
మహబూబాబాద్(ఎస్టీ) – 119343 (బానోత్ శంకర్ నాయక్)
నర్సంపేట – 110271 (పెద్ది సుదర్శన్ రెడ్డి)
వరంగల్ ఈస్ట్ – 120903 (నన్నపునేని నరేందర్)
వర్ధన్నపేట(ఎస్సీ)– 125541 ఆరూరి నరేశ్
పరకాల – 105788 (చల్లా ధర్మారెడ్డి)
వరంగల్ వెస్ట్ – 134053 (దాస్యం వినయ్ భాస్కర్)
పినపాక(ఎస్టీ) – 94012 (రేగా కాంతారావు)
ఇల్లందు(ఎస్టీ) – 105638 (బానోత్ హరిప్రియ నాయక్)
కొత్తగూడెం – 117338 (వనమా వెంకటేశ్వర రావు)
అశ్వారావుపేట(ఎస్టీ) – 76305 (మెచ్చా నాగేశ్వర్ రావు)
భద్రాచలం(ఎస్టీ) – 74121(డా. తెల్లం వెంకట్రావు)
ఖమ్మం – 159527 (పువ్వాడ అజయ్ కుమార్)
పాలేరు – 114636 (కందాల ఉపేందర్ రెడ్డి)
మధిర(ఎస్సీ) – 107698 (లింగాల కమల్ రాజు)
వైరా(ఎస్టీ) –94024 (బానోత్ మదన్ లాల్)
సత్తుపల్లి(ఎస్సీ)– 115405 (సండ్ర వెంకట వీరయ్య)
నారాయణపేట – 107139 (ఎస్.రాజేందర్ రెడ్డి)
మక్తల్ – 111870 (చిట్టెం రామ్మోహన్ రెడ్డి)
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Womens reservation bill seats reserved for women in telangana
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com