జగన్‌కు మహిళలు జై… సైలెంట్‌గా రిపోర్టులు!

ఏ ప్రభుత్వం అయినా ఏడాది పాలన పూర్తయ్యిందంటే ప్రజల స్పందన తెలుసుకుంటుంది. సీఎం పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు..? ఇంకా ఏమైనా ఆశిస్తున్నారా..? అనే అంశాలపై ఓ అంచనాకు వస్తుంది. సేమ్‌ ఏపీలో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి ఏడాదిన్నర‌ పూర్తయింది. కానీ, ఆయన పెద్దగా హడావుడి చేయడం లేదు. అదే చంద్రబాబు అయితే ప్రతి ఆరు నెలలకు ప్రజ‌ల సంతృప్తి అనే పేరుతో నివేదిక‌లు విడుద‌ల చేసేవారు. 80 శాతం, 85 శాతం పాజిటివ్‌ అని చెప్పుకునే వారు. […]

Written By: Srinivas, Updated On : December 6, 2020 11:32 am
Follow us on


ఏ ప్రభుత్వం అయినా ఏడాది పాలన పూర్తయ్యిందంటే ప్రజల స్పందన తెలుసుకుంటుంది. సీఎం పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు..? ఇంకా ఏమైనా ఆశిస్తున్నారా..? అనే అంశాలపై ఓ అంచనాకు వస్తుంది. సేమ్‌ ఏపీలో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి ఏడాదిన్నర‌ పూర్తయింది. కానీ, ఆయన పెద్దగా హడావుడి చేయడం లేదు. అదే చంద్రబాబు అయితే ప్రతి ఆరు నెలలకు ప్రజ‌ల సంతృప్తి అనే పేరుతో నివేదిక‌లు విడుద‌ల చేసేవారు. 80 శాతం, 85 శాతం పాజిటివ్‌ అని చెప్పుకునే వారు.

Also Read: ఏపీలో కలకలం.. కళ్లు తిరిగి పడిపోతున్న ప్రజలు

ఇంటలిజెన్స్‌ రిపోర్టులు

ఏపీ సీఎం జ‌గ‌న్ హడావుడి చేయడం లేదు కానీ, మీడియా, ఇంటలిజెన్స్ వ‌ర్గాల నుంచి సైలెంట్‌గా రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. ఏడాదిన్నర పూర్తయిన సంద‌ర్భంగా ఇంటిలిజెన్స్ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన జగన్‌ రాజ‌కీయ స‌ల‌హాదారు స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి మీడియాకు కొన్ని విష‌యాలు చెప్పుకొచ్చారు. జ‌గ‌న్ అమలు చేస్తున్న అనేక సంక్షేమ ప‌థ‌కాల‌తో మ‌హిళ‌ల్లో అభిమానం పెరిగింద‌ని, మ‌హిళా ఓటు బ్యాంకు త‌మ‌కేన‌ని చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికల కోసమేనా..?

స్థానిక సంస్థల ఎన్నిక‌ల నిర్వహణకు ఎస్‌ఈసీ నిమ్మగ‌డ్డ ‌ర‌మేష్‌కుమార్ రెడీ అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి స్పందిస్తూ క‌రోనా ఉన్న నేప‌థ్యంలో ఎన్నిక‌లు ఏంటని నిమ్మగడ్డపై విమ‌ర్శలు చేశారు. ఈ క్రమంలో ఎన్నిక‌ల‌కు భ‌య‌ప‌డుతున్నారా.. అని మీడియా మిత్రులు అడగగా.. అదేం లేదు.. మ‌హిళా ఓటు బ్యాంకు మావైపే ఉందని చెప్పారు. నిజానికి ఏడాదిన్నర పాలన కన్నా.. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఎదురయ్యే పరిస్థితులపైనే ఇంటలిజెన్స్‌ ఎన్నిక ఫోకస్‌ చేసినట్లు తెలుస్తోంది.

Also Read: రజినీకాంత్ రాజకీయ ప్రవేశం.. 25 ఏళ్ల నిరీక్షణ

కేబినెట్‌లోనూ చర్చ

తాజాగా జ‌రిగిన కేబినెట్‌లో సీఎం జ‌గ‌న్‌.. స్థానిక ఎన్నిక‌ల‌పై చ‌ర్చించారు. కొందరు మంత్రులు క్షేత్రస్థాయి పరిస్థితులు వివరించగా.. ఎవరూ కంగారు పడొద్దు.. రిపోర్టులు తమకు అనుకూలంగా ఉన్నాయని భరోసా ఇచ్చినట్లు తెలిసింది. తాము నిర్వహించిన స‌ర్వేల్లో మ‌హిళ‌లు మ‌న‌ప‌క్షంగానే ఉన్నార‌ని వెల్లడించారంట.. మొత్తానికి ఏడాదిన్నర పాలన తర్వాత స్థానిక ఎన్నికలు ఫేస్‌ చేయబోతున్నరన్న మాట.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్