అంతా నేనే చేశానంటున్న బాబు

‘హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టింది నేనే.. ఎయిర్‌‌ పోర్ట్‌, ఐటీ క్యారిడార్‌‌ తెచ్చింది నేనే’… అంటూ చంద్రబాబు మళ్లీ పాతలెక్కనే చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా భావిస్తున్నారో ఏమో.. హైదరాబాద్ లో ఏ చిన్న అవకాశమొచ్చినా పాతవన్నీ వల్లెవేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు వస్తున్నాయంటే తన పుణ్యమేనని, కాంగ్రెస్‌, టీఆర్‌‌ఎస్‌ చేసిందేమి లేదంటున్నారు…2016లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో చెప్పారు.. ఇప్పుడు అదే చెప్పారు.. అయినా జనం మాత్రం నమ్మలేదు. Also Read: […]

Written By: Srinivas, Updated On : December 6, 2020 11:41 am
Follow us on


‘హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టింది నేనే.. ఎయిర్‌‌ పోర్ట్‌, ఐటీ క్యారిడార్‌‌ తెచ్చింది నేనే’… అంటూ చంద్రబాబు మళ్లీ పాతలెక్కనే చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా భావిస్తున్నారో ఏమో.. హైదరాబాద్ లో ఏ చిన్న అవకాశమొచ్చినా పాతవన్నీ వల్లెవేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు వస్తున్నాయంటే తన పుణ్యమేనని, కాంగ్రెస్‌, టీఆర్‌‌ఎస్‌ చేసిందేమి లేదంటున్నారు…2016లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో చెప్పారు.. ఇప్పుడు అదే చెప్పారు.. అయినా జనం మాత్రం నమ్మలేదు.

Also Read: జగన్‌కు మహిళలు జై… సైలెంట్‌గా రిపోర్టులు!

జినోమ్‌ వ్యాలీని వదల్లేదు

తాజాగా ప్రధాని నరేంద్రమోడీ జినోమ్ వ్యాలీని సందర్శించినప్పుడు బాబు తనదైన స్టైల్లో మళ్లీ స్పందించారు. తన హయాంలో జినోమ్ వ్యాలీ వచ్చిందని చెప్పుకొచ్చారు. తాను ఆరోజు వ్యాలీ ఏర్పాటుకు కృషి చేయడం వల్లనే కరోనా వ్యాక్సిన్ రెడీ అవుతుందని కూడా అన్నారు.

గతం వేరు.. ప్రజెంట్‌ వేరు

చంద్రబాబు హయాంలో పరిశ్రమలు, ఐటీ ఇండస్ట్రీ వచ్చి ఉండవచ్చు. కానీ పదే పదే వాటినే చెప్పుకోవడం జనాలకు కూడా బోర్ కొడుతోంది. అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి రాజకీయాలు వేరు.. టీడీపీ పార్టీ తెలంగాణలో ఉనికిని కోల్పోయిన విషయాన్ని ఆయన మరిచిపోయినట్లున్నారు. ఆ పార్టీ క్యాడరంతా ఇప్పుడు టీఆర్‌‌ఎస్‌లోనో, బీజేపీలోనే సెటిల్‌ అయిపోయారు. తెలంగాణలో ఒకరిద్దరు నేతలు తప్ప.. చెప్పుకునే నాయకుడు లేకుండా పోయాడు.

Also Read: వాహనదారులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు..?

సోషల్ మీడియాలో ట్రోల్‌..

బాబు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. ‘కంప్యూటర్ ను కనిపెట్టింది కూడా నేనే’, ‘హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టింది నేనే’.. అంటూ చెప్పిన విషయాలపై సెటైరిక్‌గా పోస్టులు పెడుతున్నారు. అయితే, ఆయన చేసే వ్యాఖ్యలు తెలంగాణలో ఉనికి కోసం కాదని, ఏపీ ప్రజలను తనవైపు తిప్పుకునేందుకే..! బాబును హైదబాద్‌ను నిర్మించాడు.. అమరావతి ఆయనతోనే సాధ్యమని అనుకునేందుకే..!

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్