Woman: సాధారణంగా ఇండియాలో జరిగే నేరాలకు సంబంధించి కోర్టు తీర్పులు చాలా ఆలస్యంగా వెలువడుతుంటాయి. ఒక్క కేసు విచారణకు ఏళ్లకు ఏళ్లు పడుతుంది. కేసు విచారణకు వచ్చేలోపు పిటీషన్ వేసిన వారు లేదా నిందితులు మరణించిన ఘటనలు అనేకం ఉన్నాయి. అప్పట్లో కోర్టు పనితీరుపై విచారణకు ఏళ్లు తీసుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అందుకే ఈ మధ్యకాలంలో మహిళలకు సంబంధించి అనగా.. లైంగిక కేసుల విషయంలో త్వరగా విచారణ జరిపి తీర్పు వెలువరించేందుకు కోర్టులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

ఈ క్రమంలోనే 41ఏళ్ల కింద జరిగిన ఓ అత్యాచార కేసు గుజరాత్‌లోని అహ్మదాబాద్ కోర్టులో విచారణకు వచ్చింది. అయితే, సాక్ష్యాధారాలు సరిగాలేని కారణంగా నిందితుడిని కోర్టు నిర్దోశిగా భావించి విడుదల చేసింది. అందుకు కారణం కేసు పెట్టిన మహిళే తాను ఈ కేసు విషయంలో ఇప్పుడు పోరాడేందుకు సిద్దంగా లేనని.. తన వయస్సు ఇప్పుడు 55 ఏళ్లు. తన పిల్లలు పెద్దగా అయ్యారని లిఖిత పూర్వతంగా రాసి విజ్ఞప్తి చేయడంతో కోర్టు గత నెల 30న కేసును కొట్టివేసింది.
వివరాల్లోకివెళితే.. 1980 సంవత్సరంలో ముంబయికి చెందిన ఒక ట్యాక్సీ డ్రైవర్.. అహ్మదాబాద్‌లోని సర్కేజ్ ప్రాంతంలో నివసించే ఓ మహిళను తీసుకొని జూన్ 30 1980న పారిపోయాడు. ఆ టైంలో మహిళతో పాటు ఆమె స్నేహితురాలు కూడా కారులో ఉంది. జులై 3వ తేది స్నేహితురాలు తిరిగి అహ్మదాబాద్ వచ్చింది.కాగా, డ్రైవర్‌తో పారిపోయిన మహిళను జులై 8న పోలీసులు గుర్తించారు. బాధిత తండ్రితో పాటు మరో నలుగురు సాక్ష్యుల ఫిర్యాదు ప్రకారం ట్యాక్సీ డ్రైవర్ తన కారులో ఇద్దరు మహిళలను తీసుకెళ్లాడు. తన వెంట వచ్చిన మహిళను వాకేశ్వర్‌లోని ఇంట్లో డ్రైవర్ ఉంచాడని, జులై 1న ట్యాక్సీ డ్రైవర్ వివాహాన్ని తాను దగ్గరుండి మహిళతో జరిపించినట్టు మరో సాక్షి తెలిపాడు. అప్పుడు ఆ యువతి వయసు 20ఏళ్లు.. వివాహం తర్వాత ఆ అమ్మాయి మళ్లీ కనిపించలేదు. కానీ ఆమె స్నేహితురాలు తనను డ్రైవర్ అత్యాచారం చేశాడని అహ్మదాబాద్‌లో కేసు పెట్టింది. తీరా అది ట్రయల్‌కు వచ్చే సరికి 41 ఏళ్లు గడిచాయి.
Also Read: Modi: అవినీతి నిర్మూలనకు మోడీ చర్యలు తీసుకుంటారా?
ప్రస్తుతం అత్యాచార బాధితురాలికి పెళ్లయి పిల్లలు ఉన్నారు. ఆమె వయస్సు 55. ఈ టైంలో తాను కోర్టు వివాదాలతో తాను పోరాడలేనని తెలిపింది. దీనికి తోడు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న ట్యాక్సీ డ్రైవర్‌కు వ్యతిరేకంగా ప్రత్యక్ష సాక్ష్యం అతని భార్య.. పరోక్ష సాక్ష్యులు కూడా లేకపోవడంతో అతన్ని నిర్దోశిగా కోర్టు విడుదల చేసింది.అంతకుముందు అతనికి వివాహం జరిగిందని కోర్టు నమ్మింది. కేసు పెట్టిన సమయంలో కేసు విచారణ జరిపి నిందితుడికి శిక్ష పడితే తాను సంతోషించే దానిని అని బాధితులు తెలిపింది. 41ఏళ్ల తర్వాత మళ్లీ మొదటి నుంచి పోరాటం చేయడం తన వల్ల కాదని, పిల్లల ముందు బాగుండదని పేర్కొంది.
Also Read: PM Modi: ప్రధాని చేసిన ఈ పనికి నెటిజన్ల ప్రశంసలు.. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్