Elon Musk: పేదవాడిగా పుట్టడం తప్పు కాదు పేదవాడిగా చావడం తప్పు అంటారు. సంపద అనేది ఎవరి సొత్తు కాదు. ఎవరు కష్టపడితే వారి సొంతం అవుతుంది. అలాగని గొడ్డు చాకిరీ చేసినా నిష్ర్పయోజనమే. తెలివితో మన శక్తియుక్తులను మార్చుకోవాలి. జీవితంలో ఎదిగేందుకు దారులు వెతుక్కోవాలి. ఆర్థికంగా ఎదిగేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. అందుకోసం అహర్నిశలు శ్రమించాలి.

టెస్లా సంస్థ సీఈవో ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన వ్యక్తుల్లో మొదటి వారు కావడం గమనార్హం. అంతర్జాతీయ మ్యాగజైన్ ది టైమ్ ఈ ఏటి మేటి వ్యక్తిగా ప్రకటించింది. ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయనే ప్రథముడు కావడం తెలిసిందే. దీంతో కుబేరుల జాబితాలో అందరిని పక్కనపెట్టి తొలి స్థానం సంపాదించుకోవడం పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఎలాన్ మస్క్ 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అమెరికా వచ్చిన ఆయన ఎంతో కష్టపడి ఇంత ఎత్తుకు ఎదిగాడు. ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించి వారిని లక్షాధికారులను చేశారు. చేతిలో డబ్బు లేకుండా వచ్చిన మస్క్ పాఠశాలలో ఉన్న సమయంలోనే రెండు ఉద్యోగాలు చేసి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే నాటికి లక్ష డాలర్లకు పైగా అప్పు చేసినా తరువాత కాలంలో ఆయన తన సంపదను పెంచుకుని అగ్రస్థానానికి చేరాడు.
Also Read: Modi: అవినీతి నిర్మూలనకు మోడీ చర్యలు తీసుకుంటారా?
టెస్లా ద్వారా ట్రిలియన్ డాలర్ల విలువ గల ఎలక్రిక్ వాహనాల మార్కెట్ నిర్వహిస్తూ తానేమిటో నిరూపించుకున్నాడు. సోలార్, రోబోటెక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో సత్తా చాటి 250 బిలియన్ డాలర్లకు పైగా సంపాదించి రికార్డు నెలకొల్పాడు. ఇలా సంపద సృష్టించుకుని కుబేరుడిగా మారాడు. అందరికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు.
Also Read: America vs China: చైనాకు గట్టి షాక్ ఇచ్చిన అమెరికా.. ఏం జరుగనుంది?