KCR vs Etela: తెలంగాణలో దుబ్బాక ఎన్నికల తర్వాత పరిస్థితులు మారుతూ వచ్చాయి. ఆ తర్వాత జరిగిన హుజురాబాద్ ఎన్నికలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా కీలక మలుపు తిరిగాయి. అప్పటివరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనుకున్నవారికి బీజేపీ సడన్ షాక్ ఇచ్చింది. ఉన్నట్టుండి బీజేపీ పార్టీ బలం పుంజుకుని ఏకంగా జీహెచ్ఎంసీలో ప్రధాన ప్రతిపక్షాన్ని తలదన్ని సెకండ్ ప్లేస్‌కు చేరుకుంది. ఆ తర్వాత ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు రావడం, బీజేపీలో చేరడంతో ఒక్కసారిగా బీజేపీ తన వ్యూహాలకు పదును పెట్టింది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు బీజేపీకి ఈటల హెల్ప్ తీసుకుంటున్నట్టు తెలిసింది. టీఆర్ఎస్‌లో పదవులు రాకుండా గుర్తంపునకు నోచుకుని ఉద్యమ నాయకులను బీజేపీలోకి లాగాలని ఈటల స్కెచ్ వేశారు.
ఈ విషయం కాస్త అధికార పార్టీకి లీక్ అవడంతో టీఆర్ఎస్ పార్టీ, గులాబీ బాస్ కేసీఆర్ అప్రమత్తం అయ్యారు. కీలకమైన అసంతృప్తి నేతలు పార్టీని వీడకుండా చర్యలు చేపడుతున్నారు కేసీఆర్.. ఇప్పటికే టీఆర్ఎస్‌పై అసంతృప్తితో ఉన్న ఉద్యోగుల సంఘం మాజీ నాయకుడు విఠల్ బీజేపీలో చేరారని జోరుగా చర్చ నడుస్తోంది. అయితే, ఉద్యమంలో పని చేసి ఇంకా పదవులు దక్కని వారిపై కేసీఆర్ ఫోకస్ పెట్టారట.. వారికి త్వరలోనే నామినేటెడ్ పోస్టులు ఇస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పూర్తవడంతో నామినేటేడ్ పోస్టుల భర్తీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం..
అందులో భాగంగానే ఉద్యమ కాలంలో పనిచేసి ప్రస్తుతం టీఆర్ఎస్‌లో కొనసాగుతున్న మన్నె కృషాంక్‌ను ‘తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ ’ చైర్మన్‌గా నియమించారట.. ఇక మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారనుకున్న ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవిని అప్పగించారు. వేద సాయిచందర్‌ను తెలంగాణ స్టేట్ వేర్ హౌజింగ్ కార్పోరేషన్ చైర్మన్‌గా అవకాశం ఇచ్చారట..
Also Read: Dating Survey 2021: టాప్ ప్లేస్ లో మహానగరం.. ఎందులో అనుకుంటున్నారు.. డేటింగ్ లో..
అలాగే తెలంగాణ ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, తెలంగాణ బివరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా గజ్జెల నగేష్, తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్‌గా పాటిమీది జగన్ మోహన్ రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా జూలూరి గౌరీ శంకర్, తెలంగాణ షీప్ మరియు గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ను నియమించారని తెలిసింది. కానీ, దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.
Also Read: Inter 1st Year Results: ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలపై ఆందోళన.. ప్రభుత్వంపై నిరసన