Supreme Court- Divorce: ఇప్పుడు విడాకులు తీసుకోవడమే పెద్ద పండుగైంది

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మహిళలకు మరో ఆధారం లభించినట్లు అయింది. విడాకులకు దరఖాస్తు చేసుకుంటే ఆరునెలల తరువాత మంజూరు చేసేవారు.

Written By: Srinivas, Updated On : May 2, 2023 6:17 pm
Follow us on

Supreme Court- Divorce: మనదేశంలో అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు సంచలనం కలిగించింది. ఇంతకు ముందు విడాకులు తీసుకోవాలంటే ఆరునెలల వరకు ఆగాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో ఆడవారికి ఊరట లభించినట్లయింది. కానీ విడాకుల విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పుతో వారు మాత్రం సంతోషిస్తున్నారు. తమకు ఇన్నాళ్లు ఉన్న ఆరు నెలల నిబంధన ఇప్పుడు సవరించబడింది. దీంతో కోర్టు తీర్పు వారికి అనుకూలంగా మారుతోంది.

సుప్రీంతీర్పుతో..

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మహిళలకు మరో ఆధారం లభించినట్లు అయింది. విడాకులకు దరఖాస్తు చేసుకుంటే ఆరునెలల తరువాత మంజూరు చేసేవారు. ఆ కాలంలో వారిలో మార్పు వచ్చి మళ్లీ కలిసుండాలని అనుకుంటే వారి విడాకుల దరఖాస్తును రద్దు చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి వెసులుబాటు లేకుండా పోయింది. భార్యాభర్తలు పరస్పరం విడాకులు కావాలని కోరితే ఇవ్వొచ్చని కోర్టు చెప్పడంతో ఇక మీదట విడాకుల మంజూరు వేగంగా జరిగిపోనుంది.

మహిళల హర్షం

సుప్రీంకోర్టు తీర్పును మహిళలు స్వాగతిస్తున్నారు. సుప్రీం తీర్పుతో ఆడవారు ఫొటో షూట్ లో పాల్గొన్నారు. తమ సంతోషం వెలిబుచ్చారు. భర్తల పెత్తనం ఇక సాగదని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆలుమగల మధ్య అనుబంధం మాట ఎలా ఉన్నా ఇప్పుడు విడాకులు మాత్రం అనుకున్నంత సులువుగా తమలపాకులు దొరికినట్లు దొరుకుతాయి. ఈ క్రమంలో వారు పండగ చేసుకున్నారు. విడాకుల తీర్పుతో వారిలో సంబరాలు వెల్లువెత్తాయి.

విడాకులపై..

విడాకుల విషయంలో సుప్రీం కోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. పురుషులు ఇది సరైంది కాదని చెబుతున్నా మహిళలు మాత్రం ఇది మంచి నిర్ణయం అని అంటున్నారు. దీంతో కోరిన వెంటనే విడాకులు వస్తే ఇక వారికి అడ్డు ఉండదు. కావాలనుకునే సమయంలో విడాకులు తీసుకునే వెసులుబాటు ఇవ్వడంపై కొంత మోదం కొంత ఖేదం అనే తీరుగా ఉంటోంది.

భర్లలకు మాత్రం..

ఇక మీదట భర్తలకు మాత్రం భయమే. ఏదైనా గట్టిగా అంటే చాలు వారు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కడం ఖాయం. దీంతో భర్తలకు భయం పట్టుకోనుంది. దీంతో భార్యలకు స్వేచ్ఛ ఉంటుందని చెబుతున్నారు. వారికి ఆగ్రహం కలిగిందంటే అంతే సంగతి. విడాకులు ఇవ్వడానికి కోర్టు సుముఖత వ్యక్తం చేయడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై భర్తలు ఆలోచించుకుంటున్నారు.