
ప్రాచీన భారత దేశం అంతా ఆయుర్వేదం మీదనే నడిచింది. మూలికలు, ఔషధాలు, వనం నుంచి సేకరించిన ఆకు పసర్లనే వాడేవారు. వాటితోనే రోగాలను నయం చేసే వారు.అప్పట్లో ఇంతగా వైద్య సదుపాయాలు లేవు. అడవిలో దొరికిన మూలికలు, రాళ్లు వంటివి కలిపి ఔషధాన్ని తయారు చేసేవారు. వాటితోనే రోగం నయమైందని పలు పుస్తకాలు చెబుతున్నాయి. కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రకరకాల మందులు వస్తున్నా.. అంతకు మించి వ్యాధులు పుట్టుకొస్తున్నాయి.
ఇండియాలోని కేరళ వంటి కొన్ని ప్రదేశాల్లో ఇప్పటికీ ప్రాచీన మూలికల వైద్యంతో కొన్ని జబ్బులను నయం చేస్తున్నారు. తాజాగా ఏపీలోని నెల్లూరు జిల్లాలో కూడా అనందయ్య అలాంటి పురాతన మందులతో కరోనాను నివారించగలిగాడు.
ప్రపంచ ప్రజలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు రకరకాల అల్లోపతి మందులు వచ్చినా ఆ వ్యాధిని అరికట్టలేకపోతున్నాయి. ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సిన్లు వచ్చినా కూడా ప్రాణాలు పోతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతుండడంతో అందరికీ వ్యాక్సిన్లు అందక ప్రాణాలు పోతున్నాయి. అయితే ఇవన్నీ కాదని కొన్ని మూలికల ద్వారా తయారు చేసిన ఔషధం కరోనాను తరిమి కొడుతుందని ఆనందయ్య నిరూపించాడు. ఆ ఆ ఔషధం తీసుకున్న కరోనా బాధితులు కోలుకున్నారు. మరణించే వ్యక్తి సైతం ఆనందయ్య వైద్యం అందుకొని ఎప్పటిలాగే నడుస్తున్నారని మీడియాలో వార్తలు వింటున్నాం. ఈ తరుణంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం పేరు మరోసారి మారుమోగుతోంది.
అప్పట్లో బ్రహ్మంగారు ‘కోరంకి’ అనే జబ్బు వస్తుందని కోట్ల మంది చస్తారని చెప్పుకొచ్చాడు. ఈశాన్య ప్రాంతంలో (చైనా ఉండేది మన భారత్ కు ఈశాన్యానే) విషగాలి పుడుతుందని బ్రహ్మంగారు ఖచ్చితంగా అంచనావేశారు. ఆ తరువాత కొందరు మూలికల వైద్యంతోనే దీనిని నాశనం చేస్తారని అందులో చెప్పాడు. ఇప్పుడు అదే నిజమవుతోంది.ప్రస్తుతం అల్లోపతి, వ్యాక్సిన్లు కట్టడి చేయలేని పనిని ఆనందయ్య గనుక చేస్తే నిజంగా అదొక అద్భుతమే అని చెప్పక తప్పదు. జరుగుతున్న పరిణమాలను చూస్తే అది నిజం అవుతుందన్న అంచనాలు నెలకొంటున్నాయి.
ఆనందయ్య వైద్యంపై ఎలాంటి శాస్త్రీయత లేదని అల్లోపతి వైద్యులు ఎద్దేవా చేస్తున్నారు. అయితే ఆయుష్ సంస్థ ఈ ఔషధంతో ఎలాంటి ప్రమాదం లేదని మాత్రం తేల్చింది. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి ఔషధ పంపిణీని మాత్రం నిలిపివేశారు. కరోనాను తగ్గిస్తున్న ఈ మందును పరిశోధనల పేరిట కాలయాపన చేయకుండా అందరికీ పంచాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.