తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు దిశగా కేసీఆర్?

దేశంలో ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రపంచ దేశాలన్ని కరోనా ధాటికి భయపడిపోతోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోన నిర్మూలనకు లాక్ డౌన్ ఒక్కటే మార్గమని ప్రభుత్వాలు బావిస్తున్నాయి. ఇందులో భాగంగా పలు రాష్ర్టాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ర్టాలు నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నాయి. తెలంగాణ కూడా ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగిస్తుండగా పొడిగింపుకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ ఉన్నతాధికారులతో సుధీర్ఘంగా […]

Written By: Srinivas, Updated On : May 25, 2021 10:53 am
Follow us on


దేశంలో ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రపంచ దేశాలన్ని కరోనా ధాటికి భయపడిపోతోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోన నిర్మూలనకు లాక్ డౌన్ ఒక్కటే మార్గమని ప్రభుత్వాలు బావిస్తున్నాయి. ఇందులో భాగంగా పలు రాష్ర్టాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ర్టాలు నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నాయి. తెలంగాణ కూడా ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగిస్తుండగా పొడిగింపుకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ ఉన్నతాధికారులతో సుధీర్ఘంగా చర్చలు జరిపారు. రాష్ర్టంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. నిబంధనలు కఠినంగా అమలు చేయాలని పోలీస్ శాఖకు సూచించారు. సెకండ్ వేవ్ దృష్ట్యా కరోనా బారిన పడకుండా ప్రజలను రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు.

తెలంగాణలో కరోనా నియంత్రణకు మరోసారి లాక్ డౌన్ ను పొడిగిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈనెల 30తో లాక్ డౌన్ ముగిసే అవకాశం ఉండడంతో మరో వారం రోజులు లాక్ డౌన్ పొడిగిస్తారనే అనుకుంటున్నారు. కరోనా వైరస్ ను అంతమొందించాలంటే ప్రభుత్వం, ప్రజలు కలిసి సంయుక్తంగా పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. లాక్ డౌన్ పొడిగింపు వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజల మీద ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు.

లాక్ డౌన్ పొడిగింపుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజల నుంచి వస్తున్న సూచనలు, సలహాల మేరకు ప్రభుత్వం పొడిగింపుపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. కరోనా వైరస్ ను రూపుమాపాలంటే సరైన మందు లాక్ డౌన్ నే అని చెబుతున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వాలు లాక్ డౌన్ నే ఆయుధంగా చేసుకున్నట్లు సమాచారం.