
రాబోయే 12 గంటల్లో యాస్ తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ మంగళవారం అంచనా వేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాను గత ఆరు గంటల్లో సుమారు తొమ్మిది కీలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదిలిందని పేర్కొంది. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో పారాదీప్ కు ఆగ్నేయ దిశగా 320 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. బుధవారం సాయంత్రం వరకు తుఫాను ఒడిశాలోని బాలాసోర్ వద్ద తీరం దాటుతుందని అంచనా వేసింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది.