JanaSena: రాజకీయాల్లో అదృష్టవంతులు, దురదృష్టవంతులు ఉంటారు. ఇందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి కూతురు షర్మిల ఉదాహరణ. అన్న కోసం వదల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. వైఎస్సార్‌సీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. కానీ గెలిచిన తర్వాత అన్న చెల్లిని దూరం పెట్టారు. దీంతో తెలంగాణలో రాజకీయాలు చేయాలని వర్చారు. 3 వేల కిలోమీటర్లు నడిచారు. కానీ, చివరకు పొత్తులు చిత్తయ్యాయి. సొంతంగా పోటీ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇప్పుడు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి. అచ్చ ఇలాగే ఉంది ఆంధ్రప్రదేశ్‌లని ఆళ్లగడ్డకు చెందిన ‘ఇరిగిల’ ఫ్యామిలీ రాజకీయం 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. గెలుపు తలుపు తట్టలేకపోతున్నారు.
40 ఏళ్లుగా రాజకీయాలు..
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఇరిగల ఫ్యామిలీ 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంది. 1997లో ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో గంగుల కుటుంబం పోటీకి దూరంగా ఉండడంతో ఇరిగల రాంపుల్లారెడ్డి కాంగ్రెస్ నుంచిపోటీ చేసి ఓడిపోయారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో గంగుల కుటుంబానికి మద్దతు పలికారు. భూమానాగిరెడ్డి 2008 తెలుగు దేశం నుంచి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. దీంతో రాంపుల్లారెడ్డిని చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కూడా ఇచ్చారు. కానీ, ఆ ఎన్నికల్లోనూ పుల్లారెడ్డికి ఓటమే ఎదురైంది. ప్రజారాజ్యం నుంచిపోటీ చేసిన భూమా కుటుంబం గెలిసింది. 2012లో వచ్చిన ఉప ఎన్నికల్లోనూ పోటీ చేశారు. అయినా ఓడిపోయారు.
టీడీపీలోకి భూమా ఫ్యామిలీ..
ఆ తర్వాత జరిగిన రాజకీయా పరిణామాలతో భూమా ఫ్యామిలీ టీడీపీలో చేరింది. దీంతో ఇరిగిల కుటుంబం టీడీపీని వీడి వైసీపీలో చేరింది. 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. 2019లో వైసీపీ అభ్యర్థి గంగుల విజయేందర్‌రెడ్డి విజయానికి కృషి చేశారు.
తాజాగా జనసేనలోకి ఇరిగెల ఫ్యామిలీ..
40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా.. ఎన్నికల్లో పోటీ చేసినా.. ఇరిగెల ఫ్యామిలీని విజయం వరించలేదు. దీంతో ఈసారి ఇరిగెల సోదరులు జనసేన నుంచి అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ఆళ్లగడ్డలో బలిజ సామాజికవర్గం ఎక్కువగా ఉండడంతో ఈసారి గెలుపు వరిస్తుందని హైదరాబాద్‌లో మంగళవారం పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. ఇరిగల రాంపుల్లారెడ్డితోపాటు ఆయన సోదరులు రాంచద్రారెడ్డి, సూర్యనారాయణరెడ్డి విశ్వనాథరెడ్డి, ప్రతాపరెడ్డి జనసేనలో చేరారు. మరి ఈసారైనా వారిని విజయం వరిస్తుందో లేదో చూడాలి.