https://oktelugu.com/

వంశీ అందుకే వెనక్కి తగ్గడా?

2019ఎన్నికల్లో ఏపీలో ఫ్యాన్ గాలి జోరుగా వీయడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఏపీలో 175స్థానాలకుగాను వైసీపీ 151, టీడీపీ 23, జనసేన పార్టీకి ఒక సీటు వచ్చాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, బీఎస్పీ పార్టీలకు ఒక్కసీటు కూడా రాకపోవడం గమనార్హం. టీడీపీ అధికారం కొల్పోవడంతో ఆపార్టీలోని నేతలంతా అధికార పార్టీవైపు చూడటం మొదలుపెట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఓవైపు ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెడుతూనే మరోవైపు టీడీపీని టార్గెట్ చేశారు. దీంతో టీడీపీ నుంచి వైసీపీలోకి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 15, 2020 8:15 pm
    Follow us on


    2019ఎన్నికల్లో ఏపీలో ఫ్యాన్ గాలి జోరుగా వీయడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఏపీలో 175స్థానాలకుగాను వైసీపీ 151, టీడీపీ 23, జనసేన పార్టీకి ఒక సీటు వచ్చాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, బీఎస్పీ పార్టీలకు ఒక్కసీటు కూడా రాకపోవడం గమనార్హం. టీడీపీ అధికారం కొల్పోవడంతో ఆపార్టీలోని నేతలంతా అధికార పార్టీవైపు చూడటం మొదలుపెట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఓవైపు ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెడుతూనే మరోవైపు టీడీపీని టార్గెట్ చేశారు. దీంతో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు మొదలయ్యాయి.

    ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. అయితే చంద్రబాబులా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకోనని జగన్ గతంలోనే ప్రకటించారు. ఎవరైనా తన పార్టీలోకి వస్తే రాజీనామా చేసి రావాలని స్పష్టం చేశారు. దీంతో వైసీపీకి మద్దతు ప్రకటిస్తున్న రెబల్ ఎమ్మెల్యేలు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. వీరిలో ముఖ్యంగా గన్నవరం ఎమ్మల్యే వల్లభనేని వంశీ పేరు విన్పిస్తుంది. ఈయన 2019లో టీడీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు.

    ఏపీ కేబినెట్ విస్తరణకు తేదీ ఖరారు..

    ఆ తర్వాత చంద్రబాబుతో విబేధించి జగన్ సర్కారుకు మద్దతు ప్రకటించారు. దీంతో టీడీపీ వల్లభనేని వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో వంశీ తన ఎమ్మెల్యే పదవీ రాజీనామా చేసి వైసీపీ తరుఫున పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే తాజా తన నిర్ణయాన్ని వంశీ మార్చుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయన గెలుపుకోసం పని చేసిన టీడీపీ ఇప్పుడు ఆయనను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఉందట. గన్నవరంలోని ఆయన సామాజికవర్గం కూడా టీడీపీ వైపు చూస్తుందట. వైసీపీలోనూ తనకు వ్యతిరేకవర్గం ఎక్కువగా ఉందట. దీంతో ఇప్పటికిప్పుడు గన్నవరంలో ఎన్నికలు నిర్వహిస్తే గెలుపు కష్టమేనని లెక్కవేసుకుంటున్నారట.

    అటూ టీడీపీ, ఇటూ వైసీపీ నేతలు తనకు ఓటమికి పనిచేసే అవకాశాలు ఉండటంతో ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారనే వాదన విన్పిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం కూడా కరోనా కట్టడి, కొత్త జిల్లాల పునర్విభజన, క్యాబినేట్ విస్తరణ పనుల్లో బీజీగా ఉండటంతో ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని భావించడంతోనే వంశీ వెనక్కి తగ్గినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. జగన్ ఎప్పుడు ఆదేశాలిస్తే అప్పడు ఎన్నికలకు సిద్ధమేనంటూనే గెలుపుపై ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాడట. దీంతో ఆయన బీజేపీపై వైపు కూడా చూస్తారనే టాక్ విన్పిస్తుంది. ఒకవేళ వంశీ ఉప ఎన్నికలకు వెళితే గెలుపు అంత ఈజీ కాదనే చర్చ జరుగుతోంది.