సచిన్ కి సీఎం కుర్చీ దక్కేనా?

రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుతిరిగిన సచిన పైలట్ కి ఆ మూడు దారులు ఇంకా పదిలంగానే ఉన్నాయి. అయితే ఆయన ఏ దారిలో వెళ్లినా ఆయనకు కావాల్సింది మాత్రం సీఎం కుర్చీనే అనేది తాజా పరిస్థితుల్లో స్పష్టమౌతోంది.  ఆ సీఎం పోస్ట్ కోసం ఆయన తదుపరి ఎలా వ్యవహరిస్తారనేది ఇప్పడు అందరి మదిలో మెదలుతున్నది. రాజస్థాన్ పీసీసీ చీఫ్ పదవితోపాటు డిప్యూటీ సీఎం పదవి నుంచి ఆయనను తొలగించిన కాంగ్రెస్ పార్టీ తాజాగా నోటీసులు కూడా […]

Written By: Neelambaram, Updated On : July 15, 2020 8:16 pm
Follow us on

రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుతిరిగిన సచిన పైలట్ కి ఆ మూడు దారులు ఇంకా పదిలంగానే ఉన్నాయి. అయితే ఆయన ఏ దారిలో వెళ్లినా ఆయనకు కావాల్సింది మాత్రం సీఎం కుర్చీనే అనేది తాజా పరిస్థితుల్లో స్పష్టమౌతోంది.  ఆ సీఎం పోస్ట్ కోసం ఆయన తదుపరి ఎలా వ్యవహరిస్తారనేది ఇప్పడు అందరి మదిలో మెదలుతున్నది. రాజస్థాన్ పీసీసీ చీఫ్ పదవితోపాటు డిప్యూటీ సీఎం పదవి నుంచి ఆయనను తొలగించిన కాంగ్రెస్ పార్టీ తాజాగా నోటీసులు కూడా జారీ చేసింది. సీఎల్పీ భేటీకి గైర్హాజరులపై రెండు రోజుల్లో సమాధానం చెప్పకపోతే పార్టీ సభ్యత్వం నుంచి తొలగించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ ముందు ప్రధానంగా మూడు మార్గాలున్నాయి.

అందులో ఒకటి తలొగ్గి తిరిగి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడం. సచిన్ కోసం కాంగ్రెస్ పార్టీ ద్వారాలు తెరిచే ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే ఆయనతో మంతనాలు జరిపి బుజ్జగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ రాజీ ఒప్పందానికి రావచ్చని తెలుస్తున్నది. సీఎం పదవి ఇచ్చేది లేదని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పష్టం చేయడంతో ఆ పదవిపై ఆశలు వదులుకోవాల్సిందే. అయితే ప్రత్యామ్నాయంగా పార్టీలో సచిన్‌ కు గౌరవం దక్కేలా పీసీసీ చీఫ్ పదవిని తిరిగి కట్టబెట్టడం, ఆయన అనుచరులకు క్యాబినెట్‌ లో చోటు కల్పించడం, తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వారికి ఎక్కువ టికెట్లు కేటాయించడం వంటి వాటిపై ఒప్పందం జరిగే అవకాశమున్నది.

ఇక సచిన్ పైలట్ ముందు ఉన్న రెండో మార్గం.. బీజేపీలో చేరడం. అయితే ఈ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో కొన్నేండ్లుగా బీజేపీపై పోరాడుతున్న తాను ఆ పార్టీ చెంతన చేరలేనని చెబుతున్నారు. బీజేపీలో చేరే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఒకవేళ బీజేపీ ప్రముఖులు సచిన్‌ ను సంప్రదించి సీఎం పదవి ఇస్తామని చెబితే ఆయన తన నిర్ణయాన్ని మార్చుకుంటారా అన్నది సందేహమే. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత మెజార్టీ ఉండటంతో ఈ దిశగా ఆయన ప్రయత్నించకపోవచ్చు.

చివరిగా సచిన్ పైలట్‌ కు ఉన్న మరో మార్గం.. సొంత పార్టీని ఏర్పాటు చేయడం. బీజేపీకి, కాంగ్రెస్‌ కు వ్యతిరేకంగా కొత్తగా ప్రాంతీయ పార్టీని నెలకొల్పడం. తన అనుచరులతో కలిసి సీఎం గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టడం. అనంతరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటడం. ఈ మూడు మార్గాల్లో సచిన్ పైలట్ దేన్ని ఎంచుకుంటారో అన్నది వేచి చూడాలి.