Nara Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ లో త్వరలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించడంతో సభకు వెళ్లాలా? వద్దా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. గతంలో సభలోనే చంద్రబాబు తనను విమర్శించారని కంటతడి పెట్టుకుని ఇక సభకు రానని శపథం చేసిన నేపథ్యంలో ఇప్పుడు సభకు వెళ్లడంపై నేతల్లో చర్చనీయాంశం అవుతోంది. చంద్రబాబుతో పాటు తాము కూడా సభకు వెళ్లమని చెబుతుండటంతో బాబు వారిని బుజ్జగిస్తున్నారు. సభకు వెళ్లకపోతే మనమే నష్టపోతామని చెబుతున్నారు. ఎలాగైనా సభలో ఉండి ప్రభుత్వం చేసే తప్పిదాలను సభకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్పష్టం చేస్తున్నారు.

తాను మాత్రం సీఎం అయిన తరువాతే సభకు వస్తానని చెప్పడంతో ఇక తాను సభకు రాలేనని సూచిస్తున్నారు, పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం సభలో ఉండి ప్రభుత్వ చర్యలను ఆక్షేపించాల్సిన అవసరం ఏర్పడిందని తెలుస్తోంది. దీంతో చంద్రబాబు మాత్రం సభకు హాజరు కావడంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని సమాచారం. కానీ సభకు రాకపోతే ఏం జరుగుతుందనే దానిపై చర్చిస్తున్నారు. సభలో అవలంభించాల్సిన వ్యూహంపై కూడా మంతనాలు జరుపుతున్నారు.
Also Read: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ హత్యలు కొనసాగుతాయా?
వైసీపీ నేతల తీరుతో చంద్రబాబు మనస్తాపానికి గురై నిండు సభలోనే కంటతడి పెట్టుకున్న సంగతి తెలిసిందే.దీంతో వారి కుట్రలకు ఇబ్బంది పడిన బాబు ఇకపై తాను సభకు రానని చాణక్య శపథం చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు అధికారం కోసం ఎదురుచూస్తున్నందున ప్రతి అడుగు ఆచితూచి వేయాలని చూస్తున్నారు. వైసీపీని ఎదుర్కొనే క్రమంలో బాబు సంచలన నిర్ణయాలు తీసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

దీంతో ఏపీలో రాజకీయ పరిణామాల్లో మార్పులు వస్తున్నాయి. రెండు పార్టీలు అధికారం కోసం శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాల వేదికగా వాడుకుని ప్రజల్లో తమ పలుకుబడి పెంచుకోవాలని చూస్తున్నాయి. దీనికి టీడీపీ ఎమ్మెల్యేలు సభకు వెళ్లాల్సిందిగా బాబు చెబుతున్నా వారు మాత్రం తమ అధినేత వస్తేనే సభకు హాజరవుతామని చెబుతుండటంతో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదు.
Also Read: బయ్యారం కోసం తెలంగాణ సర్కార్ ఉద్యమం
[…] […]
[…] […]