https://oktelugu.com/

Cinema Gossips: పెళ్లితో కరోనా, సోనాక్షి క్రేజీ కామెంట్స్.. మరో 3 బెస్ట్ అవార్డులతో “జై భీమ్” !

Cinema Gossips: మార్నింగ్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. పెళ్లి చేసుకుంటే కరోనా వస్తుందన్న బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా కామెంట్స్ చేయడంతో అవి బాగా వైరల్ అయ్యాయి. అభిమానులతో సరదాగా గడిపేందుకు సెలబ్రిటీలు ఆస్క్‌ మీ అంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంటారు. ఈక్రమంలో ఇటీవలే బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా తన ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. అయితే, ఐ ముచ్చట్లలో భాగంగా ఓ అభిమాని, బాలీవుడ్‌లో అందరూ పెళ్లి చేసుకుంటున్నారు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 28, 2022 / 10:22 AM IST
    Follow us on

    Cinema Gossips: మార్నింగ్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. పెళ్లి చేసుకుంటే కరోనా వస్తుందన్న బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా కామెంట్స్ చేయడంతో అవి బాగా వైరల్ అయ్యాయి. అభిమానులతో సరదాగా గడిపేందుకు సెలబ్రిటీలు ఆస్క్‌ మీ అంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంటారు. ఈక్రమంలో ఇటీవలే బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా తన ఫ్యాన్స్‌తో ముచ్చటించింది.

    sonakshi

    అయితే, ఐ ముచ్చట్లలో భాగంగా ఓ అభిమాని, బాలీవుడ్‌లో అందరూ పెళ్లి చేసుకుంటున్నారు మీరెప్పుడు చేసుకుంటారు, మీరు పెళ్లి చేసుకుని పిల్లలని కంటే చూడాలని ఉంది. అంటూ కామెంట్స్ చేశాడు. అయితే, అతని కామెంట్స్ కి సోనాక్షి సిన్హా చాలా వినూత్నంగా ఆన్సర్ ఇచ్చింది. ‘అందరూ కరోనా బారిన పడుతున్నారు. నేను కూడా దాన్ని తెచ్చుకోవాలా’ అని మొత్తానికి ఈ బాలీవుడ్‌ బ్యూటీ ఫన్నీగా రిప్లై ఇచ్చింది.

    Also Read:  తాజీ పోరాటానికి యావదాస్తిని త్యాగం చేసిన గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడి కథ ఇదీ


    ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. అందరి మన్ననలు పొంది, ఆస్కార్‌ నామినేషన్స్‌కి కూడా వెళ్లిన “జై భీమ్” అవార్డుల పంట పండిస్తోంది. ఇటీవల 9వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఈ చిత్రాన్ని పంపగా, ఫిల్మ్‌ ఫెస్టివల్ లో 3 బెస్ట్ అవార్డులు వచ్చాయి. బెస్ట్ మూవీ అవార్డుతో పాటు హీరో సూర్య, లిజ్మోల్ జోస్‌ల అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులను కూడా ఈ చిత్రం ఎగరేసుకుపోయింది. మొత్తమ్మీద “జై భీమ్” సినిమాతో సూర్య స్థాయి పెరిగింది. ఈ సినిమాకి నిజంగా “జై భీమ్” చిత్రం చాలా బాగుంటుంది.

    Also Read: 1973 తరువాత యూరప్ లో అతిపెద్ద సంక్షోభం.. రష్యానే కారణమా?

    Tags