తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు దోచుకుని దక్షిణాదిలోనే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ త్రిష. సహాయనటిగా సినీరంగ ప్రవేశం చేసి.. ఆ తర్వాత వరుసగా హీరోయిన్ అవకాశాలను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్‌లోని టాప్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. మరోవైపు తమిళంలోనూ టాప్ హీరోయిన్గా నిలిచింది. నాలుగు పదుల వయసు వస్తున్నా త్రిషకు క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. అయితే, గత కొన్నిరోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటూ వస్తోంది ఈ అమ్మడు. తాజాగా, తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే 96 మూవీలో సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన త్రిష. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఇదిలా ఉండగా, త్రిషకు అరుదైన గౌరవం లభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం జారీ చేసే గోల్డెన్ వీసా ఆమెను వరించింది. ఈ వీసా అందుకున్న తొలి తమిళ నటిగా త్రిష రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. యూఏఈ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న తొలి నటిని తానే కావడం ఆనందంగా ఉందన్నారు త్రిష. ఇప్పటికే ఈ వీసాను ఫర్హాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, బోనీ కపూర్, అర్జున్ కపూర్, మోహన్ లాల్ మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, నేహా కక్కర్, అమాల్ మాలిక్, కేఎస్ వంటి ప్రముఖులు అందుకున్నారు. ఈ వీసా ఉన్నవారు సూదీర్ఘకాలం వరకు యూఏఈలో ఉండవచ్చు.