R S Praveen Kumar- Akunuri Murali: వారిద్దరూ సేవే పరమావధిగా పనిచేసే ఐఏఎస్, ఐపీఎస్‌లు.. అట్టడుగు వర్గాల అభివృద్ధే వారి ధ్యేయం.. 30 ఏళ్ల సర్వీస్‌లో ఎలాంటి అవినీతి మచ్చలేని అధికారలు.. అభివృద్ధిలో తమకంటూ ప్రత్యకుతను చాటుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. వివిధ ముక్రమంత్రులు వారిని సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. కానీ ప్రస్తుతం రాజకీయం పరిస్థితులు వారిని అణచివేసే ప్రయత్నాలు చేశాయి. అణగారిన వర్గాలతో.. లేక అగ్రకుల అహంకారమే.. లేక వారి నిజాయతీ నచ్చకనో అప్రాధాన్య శాఖలు కేటాయించి వారి స్థాయి తగ్గించే ప్రయత్నాలు జరిగాయి. ఇది నచ్చని ఆ ఇద్దరూ స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. పదవిలో ఉన్నప్పుడు ఎంతో బిజీగా ఉండే వారు ప్రస్తుతం మరింత బిజీ అయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్ హోదాలో తాము ఏ లక్ష్యం కోసం పనిచేశారు. దానిని సామాజిక మార్పు ద్వారా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వారే రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, రిటైర్డ్ ఐపీఎస్ ఆర్‌ఎస్. ప్రవీణ్‌కుమార్. ఒకరు రాజీకయంగా మార్పు కోసం ప్రత్నిస్తుంటే.. మరొకరు సామాజిక చైతన్యం కోసం స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు.
సమర్థుడిని వదులుకున్న తెలంగాణ..
ఆకునూరి మురళి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కన్ఫర్డ్ ఐఏఎస్‌గా పదోన్నతి పొందారు. దేశంలో సివిల్ ఇంజినీరింగ్ నుంచి కన్ఫర్డ్ ఐఏఎస్‌గా పదోన్నతి పొందిన మొదటి వ్యక్తి. ఆయన పనితీరే ఆయనకు ఐఏఎస్ మోదా తీసుకొచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన మురళి తెలంగాణ ఆవిర్భావం తర్వాత నవ తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములవ్వాలని భావించారు. తన సమర్థతను రాష్ట్ర అభివృద్ధికి వినియోగించుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు కన్ఫర్డ్ ఐఏఎస్ పదోన్నతి రావడం మరింత ఉత్సాహం ఇచ్చింది. కానీ ఉమ్మడి రాష్ట్రంలో గానీ, ఆయన 30 ఏళ్ల సర్వీసలోగానీ ఎన్నడూ లేనంత వివక్ష ఎదుర్కొవాల్సి వచ్చింది. తెలంగాణ గురించి ఆయన ఒకటి ఆనుకుంటే పలకులు ఇంకోటి ఆలోచించారు. సమర్థుడి అణగదొక్కే ప్రయత్నాలు అడుగడుగునా జరిగాయి. కుటిల రాజకీయాల్లో ఇమడలేక ఆకునూరి మురళి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. తెలంగాణ వదుకులున్న సమర్థుడిని ఆంధ్రప్రదేశ్ అక్కున చేర్చుకుంది. సీఎంగా జగన్‌మోహన్‌రెడి బాధ్యతలు స్వీకరించాక ఆకునూరికి కీలక బాధ్యతలు అప్పగించారు. విద్యాశాఖ సలహాదారుగా నియమించి ప్రభుత్వ విద్యావ్యవస్థ పటిష్టానికి కృషి చేస్తున్నారు.
‘ప్రావీణ్యు’డికి చెక్ పెట్టారు.
ఆర్‌ఎస్. ప్రవీణ్‌కుమార్. ఈయన ఐపీఎస్‌గా సమర్థవంతంగా పనిచేశారు. ఆయన పనితీరును గుర్తించి ఉమ్మడి ఆంద్రప్రదేశలోనే ప్రభుత్వాలు కీలక బాధ్యతలు అప్పగించారు. పోలీస్ అధికారిగా ఎంత సమర్థవంతంగా పనిచేశారు. విద్యాశాఖ కార్యదర్శిగా కూడా అంతే సమర్థవంత అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పాఠశాలలు, ముఖ్యంగా అణగారిన వర్గాల పిల్లల్లో టాలెంట్‌ను వెలికి తీయడానికి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గురుకులాలను బలోపేతం చేశారు. నేడు గురుకులాలు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఆర్‌ఎస్పీ అనడంలే సందేహమే లేదు. కానీ.. తెలంగాణలో ఆయన ను కూడా అణచివేతకు ప్రయత్నాలు జరిగాయి. సమర్థవంతమైన అధికారికి చెక్‌పెట్టే ప్రయత్నాలు జరిగాయి. పాలకుల కుట్రలను ముందే పసిగట్టిన ఆరెస్పీ స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకున్నారు.
ఒకరిది సామాజిక ఉద్యమం.. మరొకరిది రాజకీయ పోరాట..
తెలంగాణ రాజకీయనేత ఆధిపత్యం, అణగారిణ వర్గాల అణచివేతను భరించలేక ఉద్యోగాలను గడిపోచలా వదిలేసిన ఆ ఇద్దరూ దళితులే. ఐఏఎస్, ఐపీఎస్ హోదాలో ఉన్న తామే ఇంత అణచివేత, వివక్షను ఎదుర్కొంటే సామాన్యుల పరిస్థితి ఏమిటన్న ఆలోచన వారిని ఆందోళనకు గురిచేసింది. ఈ క్రమంలో సామాజికి చైతన్యంతో అహంకారాన్ని, అధికార మధాన్ని అణచివేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆకునూరి మురళీ సామాజికి ఉద్యమ మార్గాన్ని ఎంచుకున్నారు. సోషల్ డెమొక్రటిక్ ఫోరం ఏర్పాటు చేసి గ్రామీణ స్థాయి నుంచి బడుగు బలహీనవర్గాల్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ.. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి దిశానిరేశం చేస్తున్నారు. విద్యార్థుల్లో చైతన్యం తెచ్చేందుకు సామాజిక ర్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఆంధ్రాలో పాఠశాలలను బలోపేతం చేస్తూనే తెలంగాణలో సమాజిక మార్పు కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఆర్‌ఎస్. ప్రవీణ్‌కుమార్ కూడా సామాజిక మార్పు ప్రస్తుత పరిస్థితిలో రాజకీయం పోరాటంతోనే సాధ్యమని నమ్మారు. పదవి వదులుకున్నాక బీఎస్పీలో చేరారు. తెలంగాణలో అంతంత మాత్రంగా ఉన్న బీఎస్పీ ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ చేరిక తర్వాత కొంత యాక్టివ్ అయింది. సామాజిక మార్పు కోసం నీలిరంగు జెండా పట్టుకుని ఇటీవల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. గ్రామగ్రామానికి వెళుతూ.. సామాజికి , ఆర్థిక పరిస్థితలు తెలుసుకుంటున్నారు. సామాజిక మార్పు కోసం చేయాల్సిన అవగాహన కల్పిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. వెనుగబడి, బడుగు, బలహీన వర్గాల అణచివేతకు జరుగుతున్న కుట్రలను ఎండగడుతున్నారు.
ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీరి నిజాయతీ పోరాటాన్ని తెలంగాణ ప్రజానీకం ఎంతవరకు అర్థం చేసుకుంటుంది. బడగు, బలహీన వర్గాల్లో ఎంత వరకు మార్పు వస్తుంది, వారిలో చైతన్యం ఏమేరకు పెరుగుతుంది అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.