Chandrababu: చంద్రబాబు కోసం అంతలా దిగజారుతారా?

జైలు జీవితం గడుపుతున్నప్పుడు కొన్ని నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది. చంద్రబాబుకు అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు నిబంధనల ప్రకారం వైద్యులు వెళ్లి పరీక్షలు నిర్వహించారు.

Written By: Dharma, Updated On : October 16, 2023 2:26 pm

Chandrababu Legal Mulakat

Follow us on

Chandrababu: స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యి దాదాపు 35 రోజులు దాటుతోంది. ఆయన ఆరోగ్య స్థితిపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఇటీవల అరెస్టు అయ్యి జైలు జీవితం గడుపుతున్న రాజకీయ ప్రముఖుల విషయంలో రాని విషయాలు, అంశాలు, వివాదాలు వెలుగులోకి వస్తుండడం విశేషం.73 ఏళ్ల వయసులో చంద్రబాబు జైలులో గడపడం కాస్తంత ఇబ్బందికరమే. ఎప్పుడూ ఏసీలతోపాటు అత్యాధునిక వసతుల మధ్య గడిపిన వ్యక్తికి నలల తరబడి జైల్లో ఉంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, ఒంట్లో నలత సహజం. కానీ దానిని భూతద్దంలో చూపించేందుకు ప్రయత్నిస్తుండడం మాత్రం కొద్దిగా అతిగా అనిపిస్తుంది.

జైలు జీవితం గడుపుతున్నప్పుడు కొన్ని నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది. చంద్రబాబుకు అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు నిబంధనల ప్రకారం వైద్యులు వెళ్లి పరీక్షలు నిర్వహించారు. మందులు ఇచ్చారు. డాక్టర్లు తమ వంతు తాము ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు కి కేవలం దద్దుర్లు మాత్రమే వచ్చాయి. కానీ స్టెరాయిడ్స్ తో చంపే ప్రయత్నం చేస్తున్నారని.. ఆయన ఆరోగ్యం పై నిర్లక్ష్యం చేస్తున్నారని.. ఇది ముమ్మాటికి ప్రభుత్వ కుట్రగా చెబుతూ ఎల్లో మీడియా రెచ్చిపోతుంది. కథనాలను వండి వార్చుతోంది.

అవినీతి కేసుల్లో చాలామంది నాయకులు అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం దాదాపు 110 రోజులు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ప్రజా నాయకుడు వరవర్రావు ఓ కుట్ర కేసులో ఏళ్ల తరబడి జైల్లో మగ్గాల్సి వచ్చింది. వీరిద్దరి వయసు 70 సంవత్సరాల పై మాటే. అంతెందుకు మొన్నటికి మొన్న ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సిసోడియా అరెస్ట్ అయ్యారు. నెలల తరబడి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కానీ వారి జైలు జీవితం, అనారోగ్యం విషయంలో ఎటువంటి వివాదాలు వెలుగు చూడలేదు. ఇప్పుడు చంద్రబాబు విషయంలో మాత్రమే వివాదాలు జరుగుతున్నాయి. దానికి ఎల్లో మీడియా అతి కారణమని తెలుస్తుంది.

స్కిల్స్ స్కాం హై ప్రొఫైల్ కేసు. చంద్రబాబు సుదీర్ఘకాలం ఈ రాష్ట్రాన్ని పాలించిన సీఎం. 73 సంవత్సరాల వయసున్న నేత. అందుకే న్యాయస్థానం సైతం ప్రత్యేక పరిగణలోకి తీసుకుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఇంటి భోజనానికి సైతం అనుమతించింది. ఎప్పటికప్పుడు విచారణలో ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇన్ని మినహాయింపులు ఇచ్చిన తర్వాత కూడా చంద్రబాబువిషయంలో జైలు వసతులు,అనారోగ్యం విషయంలో జరుగుతున్న ప్రచారం దారుణం. చంద్రబాబుకు వచ్చింది దద్దుర్లు. కానీ ఆయన ప్రాణానికి హాని కలిగించే అనారోగ్య పరిస్థితులు ఉన్నాయని ఎల్లో మీడియా ప్రచారం చేయడం జుగుప్సాకరంగా ఉంది. ఈ వయసులో చంద్రబాబును అరెస్టు చేశారన్న సానుభూతిని సైతం పక్కదారి పట్టించేలా ఎల్లో మీడియా ప్రవర్తిస్తుందన్న విశ్లేషణలు వస్తున్నాయి.