Sukumar: వామ్మో సుకుమార్ స్పీడ్ మామూలుగా లేదుగా.. స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్!

Sukumar: టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకూ సుకుమార్ ఎంతో ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలను తెరకెక్కించిన ప్రస్తుతం మాత్రం ఆయన స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వరుస స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పుష్పా సినిమా ద్వారా ఒక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సుకుమార్ త్వరలో పుష్ప పార్ట్ 2 చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. […]

Written By: Raghava Rao Gara, Updated On : December 29, 2021 5:26 pm
Follow us on

Sukumar: టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకూ సుకుమార్ ఎంతో ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలను తెరకెక్కించిన ప్రస్తుతం మాత్రం ఆయన స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వరుస స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పుష్పా సినిమా ద్వారా ఒక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సుకుమార్ త్వరలో పుష్ప పార్ట్ 2 చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు.

ఈ సినిమా ఫిబ్రవరిలో షూటింగ్ పనులను ప్రారంభించి వచ్చే ఏడాది క్రిస్మస్ కి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా తరువాత సుకుమార్ మరొక పాన్ ఇండియా హీరోని లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఆ హీరో ఎవరా అనే విషయానికి వస్తే రౌడీ హీరోగాఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండతో సుకుమార్ తన తర్వాత ప్రాజెక్టు ఉండబోతుందని వెల్లడించారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు.

ఈ సినిమా ఆగస్టు 25 వ తేదీ విడుదల అయిన తర్వాత విజయ్ దేవరకొండ సుకుమార్ సినిమాతో బిజీ కానున్నారు. ఈ సినిమా అనంతరం సుకుమార్ మరోసారి రంగస్థలం కాంబినేషన్ ను రిపీట్ చేయనున్నట్లు తెలుస్తోంది. రంగస్థలం సినిమా ద్వారా రామ్ చరణ్ సమంత అద్భుతమైన విజయాన్ని వారి ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే మైత్రి మూవీ మేకర్స్ మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్లో సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.