AP PRC: ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ రగడ సాగుతూనే ఉంది. ఇవాళ ఉద్యోగ సంఘాలు చలో విజయవాడ కు పిలుపు నిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. సభ నిర్వహణను అడ్డుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే వాహనాలను అడ్డుకుంటున్నారు. ఉద్యోగ సంఘాల నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఉద్యోగులకు సెలవు ఇవ్వొద్దని ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు అధికారులకు సూచనలు చేశారు. అవసరమైతే తప్ప సెలవు కేటాయించొద్దని తెలిపారు. దీంతో ఉద్యోగ సంఘాల్లో కూడా సభ నిర్వహణపై అనుమానాలు వస్తున్నాయి. ఏది ఏమైనా సభ జరిపి తీరుతామని స్పష్టం చేస్తుండగా ప్రభుత్వం మాత్రం అనుమతులు ఇవ్వడం లేదు. కరోనా నేపథ్యంలో సభ నిర్వహణ సాధ్యం కాదని చెబుతోంది. దీంతో ఉద్యోగులు మాత్రం కొందరు ఇప్పటికే విజయవాడ చేరుకోవడం గమనార్హం.
పీఆర్సీపై సీఎం జగన్ స్పందించారు. ఉద్యోగుల ప్రయోజనాలకు పెద్దపీట వేశామని పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. వారికి ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్లు కట్టించేందుకు కూడా రుణం అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇన్ని చేస్తున్నా ఉద్యోగులు ఇంకా డిమాండ్లు తీర్చాలని సమ్మె చేస్తామనడం ఆశ్చర్యకరమన్నారు. దీంతో ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వానికి మధ్య కుదరడం లేదు. వారు సమ్మె చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: AP PRC Issue: పీఆర్సీ చర్చలు జరగలే.. ప్రభుత్వం మంచి ఛాన్స్ మిస్ చేసుకుందా..?
దీంతో గురువారం సభ నిర్వహణపై పోలీసులు అడ్డుకుంటున్నారు. కానీ ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం పట్టించుకోవడం లేదు. సర్కారు తీరుపై విమర్శలు చేస్తున్నారు. శాంతియుతంగా సభ నిర్వహించుకుంటే ప్రభుత్వానికి ఏం నష్టమని ప్రశ్నిస్తున్నారు. కరోనా నిబంధనల మేరకు అనుమతి లేదని ప్రభుత్వం చెబుతోంది. దీంతో రాష్ట్రంలో ఏం జరుగుతుందోననే సందేహాలు వస్తున్నాయి. మొత్తానికి పీఆర్సీ రగడ పెద్ద దుమారమే రేపుతోంది. ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య దూరం పెరిగిపోతోంది.
ఉద్యోగుల డిమాండ్లు ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్చేది లేదని ప్రభుత్వం తెగేసి చెబుతోంది. కొత్త జీవోలు రద్దు చేయాలని ఉద్యోగులు సూచిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం కుదరదని సూచిస్తోంది. దీంతో సమ్మె తప్పదని ఉద్యోగులు బీష్మించుకు కూర్చున్నారు. దీంతో ప్రభుత్వనికి ఉద్యోగులకు మధ్య సఖ్యత కుదరడం లేదు దీంతోనే వారు సమ్మెకు దిగాలని భావిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం సమ్మెను విచ్చిన్నం చేస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోందో తెలియడం లేదు
Also Read: కేంద్రంపై జగన్ వైఖరి మార్చుకోవాల్సిందే.. ఆ విషయాలపై ప్రశ్నించకుంటే కష్టమే..!