https://oktelugu.com/

Karthika Deepam February 3 Episode: మరో ట్విస్ట్.. డాక్టర్ అంజలి ఆహ్వానంతో కార్తీక్ ను కలవనున్న మోనిత!

Karthika Deepam February 3 Episode: బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. హాస్పిటల్ లో డాక్టర్ ఈ ఆపరేషన్ డాక్టర్ కార్తీక్ మాత్రమే చేయగలరని.. ఆయన అపాయింట్మెంట్ దొరకడం అంత సులువు కాదని కార్తీక్ గురించి గొప్పగా అనడంతో దీప నేను ఎలాగైనా డాక్టర్ కార్తీక్ గారిని పిలుస్తానని అంటుంది. ఇక పక్కనే ఉన్న కార్తీక్ కు ఎటు అర్థం కాకుండా ఉంటుంది. వెంటనే దీప హాస్పిటల్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 3, 2022 / 10:36 AM IST
    Follow us on

    Karthika Deepam February 3 Episode: బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. హాస్పిటల్ లో డాక్టర్ ఈ ఆపరేషన్ డాక్టర్ కార్తీక్ మాత్రమే చేయగలరని.. ఆయన అపాయింట్మెంట్ దొరకడం అంత సులువు కాదని కార్తీక్ గురించి గొప్పగా అనడంతో దీప నేను ఎలాగైనా డాక్టర్ కార్తీక్ గారిని పిలుస్తానని అంటుంది. ఇక పక్కనే ఉన్న కార్తీక్ కు ఎటు అర్థం కాకుండా ఉంటుంది.

    Karthika Deepam February 3 Episode

    వెంటనే దీప హాస్పిటల్ బయట కార్తీక్ ను బ్రతిమాలుతుంది. సౌర్యను కాపాడమని కోరుతుంది. కాని కార్తీక్ ఈ పరిస్థితులో ఎలా చేయాలి అని అంటాడు. దీప మాత్రం నీ భార్య గా కాకుండా.. ఒక తల్లిగా నా బిడ్డ ప్రాణాలు కాపాడండి అని అడుగుతున్నాను. ఎలాగైనా మీరే ఆపరేషన్ చేసిన నా కూతుర్ని కాపాడాలి అని కాళ్లు మొక్కుతుంది.

    Also Read: హీరోయిన్ల అకౌంట్స్ హ్యాక్ అయితే ఓకే, అదే ఫోన్స్ హ్యాక్ అయితే.. ?

    వెంటనే కార్తీక్ దీపను ఓదార్చుతాడు. ఇక మోనిత కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉండగా డాక్టర్ భారతి వస్తుంది. భారతి.. తను ఓ ఊరు వెళ్తున్నానని అక్కడ ఫంక్షన్ ఉందని నువ్వు కూడా రా అని అనడంతో దానికి మొదట ఒప్పుకోదు. అసలు ట్విస్ట్ ఏంటంటే.. డాక్టర్ అంజలినే డాక్టర్ భారతిని పిలుస్తుంది. ఇక మోనిత కార్తీక్ జాడ అక్కడ తెలుస్తుందని ఒప్పుకుంటుంది. ఒకవేళ డాక్టర్ అంజలి ద్వారా కార్తీక్ ను మోనిత కలిస్తుందేమో చూడాలి. రుద్రాణి ఆవేశం తో రగిలిపోతుంది. కార్తీక్ వాళ్లు ఎక్కడ ఉన్నారు అని ఆలోచిస్తుంది. వాళ్లను వదిలేది లేదు అంటూ.. తన మనుషులకి ఫోన్ చేస్తుంది.

    ఇక వాళ్ళు కార్తీక్ వాళ్ళని వెతికే పనిలో ఉంటారు. కార్తీక్ సౌర్య ప్రాణాలను కాపాడటం కోసం మళ్లీ డాక్టర్ గా మారుతాడు. ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లి కూతురికి వైద్యం చేస్తాడు. ఇక బయట దీప, హిమ ఎదురుచూస్తూ ఉంటారు. అంతలోనే కార్తీక్ బయటకి రావడంతో దీప కార్తీక్ ను గుర్తుపట్టి ఆశ్చర్యపోతుంది. కార్తీక్ అక్కడి నుంచి వెళుతూ సౌర్య ఓకే అన్నట్లుగా నవ్వుతూ చెబుతాడు. ఇక దీప సంతోషంగా ఊపిరిపీల్చుకుంటుంది. మొత్తానికి సౌర్య ప్రాణాలతో బయట పడింది.

    Also Read: రవితేజకి అత్తగా అనసూయ.. ఆ మందు తాగే సీన్ లో.. ?