https://oktelugu.com/

BJP Targets KCR: కేసీఆరే టార్గెట్ః బీజేపీ భీమ్ దీక్ష‌ల‌తో చెక్ పెట్టే య‌త్నం?

BJP Targets KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు భార‌త రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. భార‌త రాజ్యాంగాన్ని మార్చాల‌ని మాట్లాడ‌టంపై అన్ని వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కేసీఆర్ కు మ‌తి ఉందా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. సాక్షాత్తు రాజ్యాంగంపైనే విమ‌ర్శ‌లు చేయ‌డం ఆయ‌న తెలివిత‌క్కువ త‌నానికి నిద‌ర్శ‌న‌మ‌నే పోస్టులు వ‌స్తున్నాయి. ఒక ద‌శ‌లో ఆయ‌న్నే మ‌ర్చాల‌నే డిమాండ్ కూడా వ‌స్తోంది. దీంతో విమ‌ర్శ‌ల సుడిగుండంలో కొట్ట‌కుపోతున్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ కూడా […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 3, 2022 / 10:59 AM IST
    Follow us on

    BJP Targets KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు భార‌త రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. భార‌త రాజ్యాంగాన్ని మార్చాల‌ని మాట్లాడ‌టంపై అన్ని వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కేసీఆర్ కు మ‌తి ఉందా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. సాక్షాత్తు రాజ్యాంగంపైనే విమ‌ర్శ‌లు చేయ‌డం ఆయ‌న తెలివిత‌క్కువ త‌నానికి నిద‌ర్శ‌న‌మ‌నే పోస్టులు వ‌స్తున్నాయి. ఒక ద‌శ‌లో ఆయ‌న్నే మ‌ర్చాల‌నే డిమాండ్ కూడా వ‌స్తోంది. దీంతో విమ‌ర్శ‌ల సుడిగుండంలో కొట్ట‌కుపోతున్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ కూడా దీన్ని క్యాష్ చేసుకోవాల‌ని చూస్తోంది. ఇన్నాళ్లు బీజేపీపై మండిప‌డుతున్న కేసీఆర్ కు త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని భావిస్తోంది. ఇందులో భాగంగానే భీమ్ దీక్ష‌ల పేరుతో నిర‌స‌న చేప‌ట్టాల‌ని చూస్తోంది.

    BJP Targets KCR

    బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ కూడా ఈ మేర‌కు దీక్ష చేపట్ట‌నున్నారు. కేసీఆర్ వ్యాఖ్య‌ల‌తో ద‌ళితుల ఆత్మ‌గౌర‌వం దెబ్బ తిన్న‌ద‌ని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు ద‌ళితుల‌పై ప్రేమ లేద‌ని వారిని కించ‌ప‌ర‌చ‌డ‌మే ఉద్దేశంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు తెలుస్తోంద‌న్నారు. కేసీఆర్ అహంకారానికి ఇదే ప్ర‌త్య‌క్ష తార్కాణ‌మ‌నే వాద‌న‌లు కూడా వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ రాజ‌కీయ పెనుగాలిలో ఒంటరిగా మారిన‌ట్లు తెలుస్తోంది. అప‌ర చాణక్యుడిగ పేరు గాంచిన కేసీఆర్ ఇంతలా దిగ‌జారిపోవ‌డంలో ఆంత‌ర్య‌మేమిట‌నే ప్ర‌శ్న‌లు కూడా వ‌స్తున్నాయి.

    BJP Targets KCR

    Also Read: KCR vs BJP: రాజ్యాంగాన్ని తిరగరాయాలన్న బీజేపీ ప్లాన్ లో కేసీఆర్ భాగమా?

    కొద్ది రోజులుగా బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య ప్ర‌త్య‌క్ష యుద్ధమే కొన‌సాగుతోంది. బీజేపీని టార్గెట్ చేసుకుని కేసీఆర్ ఏదో సాధించాల‌ని ఉవ్విళ్లూరుతున్నా అది నెర‌వేర‌డం అంత సులువు కాద‌నే విష‌యం తెలుసుకోవ‌డం లేదు. అందుకే బీజేపీయేతర పక్షాల‌తో మూడో కూట‌మి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసినా ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డం లేదు. దీంతో ఇత‌ర మార్గాల‌పై కూడా ఫోక‌స్ పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. దీంతోనే ఆయ‌న రాజ్యాంగంపై అన‌వ‌స‌ర వ్యాఖ్య‌లు చేసి అడ్డంగా బుక్క‌య్యారు.

    ఇప్పుడు ఇదే అంశాన్ని దేశ‌వ్యాప్తంగా ప్ర‌చారం చేసి కేసీఆర్ ను టార్గెట్ చేసుకుంది బీజేపీ. దీని కోస‌మే భీమ్ దీక్ష‌లు చేస్తోంది. కేసీఆర్ దురుద్దేశాన్ని ప్ర‌జ‌ల‌కు విడ‌మ‌ర్చి చెప్పేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. దీంతో కేసీఆర్ ప‌ని ఇక అంతే సంగ‌తి అనే అభిప్రాయాలు వ‌స్తున్నాయి. తాను త‌వ్వుకున్న గోతిలో తానే ప‌డిన‌ట్లు కేసీఆర్ బీజేపీని ల‌క్ష్యంగా చేసుకున్నా చివ‌ర‌కు తానే దొరికిపోవ‌డంతో టీఆర్ఎస్ వ‌ర్గాలు సైతం సైలెంట్ అయిపోయాయి. అందుకే అన్నారు చెర‌ప‌కురా చెడేవు అని. ఒక‌రి మీద బుర‌ద వేయాల‌ని ప్ర‌య‌త్నిస్తే అది మ‌న మీదే ప‌డుతుంది. ప్ర‌స్తుతం కేసీఆర్ ప‌రిస్థితి అడ‌క‌త్తెర‌లో చిక్కుకున్న పోక‌చెక్క‌లా మారింది. ఏం మాట్లాడ‌కుండా ఉండిపోవ‌డం కొస‌మెరుపు.

    Also Read: Bjp: కేంద్రం తీరుతో నైరాశ్యంలో బీజేపీ నేతలు?

    Tags