https://oktelugu.com/

‘మోనార్క్’ బాలయ్య కూడా కొట్టుడే !

నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ‘మోనార్క్’ అనే రొటీన్ యాక్షన్ కొట్టుడు సినిమా ఒకటి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా బాలయ్య ఎప్పటిలాగే కత్తి పట్టి శత్రువుల తలలు నరిగే సీన్స్ తోనే నెట్టుకురావాలని చూస్తున్నాడు. ఇటీవలే బాలయ్య గెటప్ ను రివీల్ చేస్తూ చిత్రబృందం విడుదల చేసిన టీజర్ లో కూడా బాలయ్య కొట్టుడు తప్ప కొత్తదనం ఏం లేదు. ఇప్పటికే కొంతమంది నెటిజన్లు బాలయ్య కొట్టుడు మాత్రం […]

Written By:
  • admin
  • , Updated On : June 23, 2020 / 04:41 PM IST
    Follow us on


    నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ‘మోనార్క్’ అనే రొటీన్ యాక్షన్ కొట్టుడు సినిమా ఒకటి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా బాలయ్య ఎప్పటిలాగే కత్తి పట్టి శత్రువుల తలలు నరిగే సీన్స్ తోనే నెట్టుకురావాలని చూస్తున్నాడు. ఇటీవలే బాలయ్య గెటప్ ను రివీల్ చేస్తూ చిత్రబృందం విడుదల చేసిన టీజర్ లో కూడా బాలయ్య కొట్టుడు తప్ప కొత్తదనం ఏం లేదు. ఇప్పటికే కొంతమంది నెటిజన్లు బాలయ్య కొట్టుడు మాత్రం వదట్లేదు అని కామెంట్లు పెడుతున్నారు. ఇక రెండు విజ‌య‌వంత‌మైన చిత్రం త‌ర్వాత ఈ హిట్ కాంబినేష‌న్‌ లో రూపొందుతోన్న ఈ చిత్రం తరువాత షెడ్యూల్ హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో జరుగనుంది.

    రెండు పడవల ప్రయాణంలో ఉనికిని కోల్పోతున్న పవన్

    ఈ షెడ్యూల్ లో కూడా ఫుల్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయనున్నారు బోయపాటి. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ షెడ్యూల్ కోసం ప్రస్తుతం ఓ భారీ సెట్ కూడా వేస్తున్నారట. ఇక ఈ సినిమాలో బాలయ్య బాబు రెండు డిఫ‌రెంట్ లుక్స్‌ లో క‌న‌ప‌డబోతున్నారు. అన్నట్టు ఈ చిత్రంలో బాలయ్య సరసన వేదిక అండ్ ఓ కొత్త హీరోయిన్ హీరోయిన్లుగా నటించనున్నారు. అయితే వేదిక ప్లాష్ బ్యాక్ లో వచ్చే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుంది.

    జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా భయం?

    అలాగే ఓ కీలకమైన పాత్రలో శ్రీయా కూడా కనిపించనుంది. శ్రీయాది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర.. ముఖ్యంగా సినిమాలో బాలయ్యకి విలన్ గా కనిపించనుంది. అలాగే ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ పవర్ ఫుల్ విల‌న్‌ గా న‌టించ‌బోతున్నాడు. ‘సింహ’, ‘లెజెండ్’ లాంటి సూపర్ డూపర్ హిట్స్ ను అందించిన బోయపాటి ఈసారి కూడా సూపర్ హిట్ ఇస్తాడని బాలయ్య ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్‌ పతాకం పై నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.