https://oktelugu.com/

సీఐడీ సునీల్ కుమార్ పై కేంద్రం చర్యలు తీసుకుంటుందా?

ఆంధ్రప్రదేశ్ సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ఆయనపై వివాదాలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ ఏపీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ ను ఆదేశించింది. ఆయన హిందూ వ్యతిరేక ప్రసంగాలు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఓ సంస్థ పెట్టి ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చేలా ప్రసంగాలు చేయడంపై ఎంపీ రఘురామ కృష్ణంరాజుతోపాటు లీగల్ రైట్స్ అడ్వైజరీ అనే స్వచ్ఛంద సంస్థ కన్వీనర్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై […]

Written By: , Updated On : July 3, 2021 / 07:04 PM IST
Follow us on

Sunil Kumarఆంధ్రప్రదేశ్ సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ఆయనపై వివాదాలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ ఏపీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ ను ఆదేశించింది. ఆయన హిందూ వ్యతిరేక ప్రసంగాలు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఓ సంస్థ పెట్టి ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చేలా ప్రసంగాలు చేయడంపై ఎంపీ రఘురామ కృష్ణంరాజుతోపాటు లీగల్ రైట్స్ అడ్వైజరీ అనే స్వచ్ఛంద సంస్థ కన్వీనర్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు.

దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. సునీల్ కుమార్ సోషల్ మీడియాలో నుంచి వీడియోలను డిలిట్ చేయించినా అప్పటికే వాటితో ఫిర్యాదు చేయడంతో కేంద్ర హోం శాఖ సీరియస్ గా తీసుకుంది. ఎంపీ రఘురామ, లీగల్ రైట్స్ అడ్వైజరీ సంస్థ చేసిన ఫిర్యాదులను ఆధారాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శికి కేంద్ర హోం శాఖ పంపింది. దీంతో సునీల్ కుమార్ పై ఏ మేరకు చర్యలు తీసుకుంటారోనని అందరిలో ఆసక్తి నెలకొంది.
దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో ఆయనపై ఏదో చర్య తప్పనిసరి ఉంటుందని భావిస్తున్నారు. అయితే సివిల్ సర్వీస్ అధికారులపై ముందుగా చర్యలు తీసుకోవాలంటే బదిలీ చేస్తారు. కానీ సునీల్ కుమార్ విషయంలో ప్రభుత్వం ఏ రకమైన చర్యలకు దిగుతుందో వేచి చూడాల్సిందే. సర్కారుకు విశ్వాసపాత్రుడైన నేపథ్యంలో బదిలీచేస్తారో లేక ఇంకే రకమైన క్రమశిక్షణ చర్యలకు దిగుతారోనని చర్చనీయాంశంగా మారింది.

సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ తీరు మొదటి నుంచి వివాదాస్పదమే. వైసీపీ కోసం తన విధులు నిర్వహిస్తున్నారనే అపవాదు మూటగట్టుకున్నారు. ప్రభుత్వ పెద్దల అవసరాలు తీర్చడం కోసమే సునీల్ కుమార్ విధులు నిర్వహించినట్లు ఆరోపణలున్నాయి. ఈనేపథ్యంలో ఆయనపై పలు ఆరోపణలు కేంద్రానికి వెళ్లాయి. రఘురామ అరెస్టు వ్యవహారంలో ఆయనపై ఫిర్యాదులు వచ్చిన విషయం తెలిసిందే. పలుమార్లు కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కేంద్రం సునీల్ కుమార్ ను తప్పిస్తుందా? లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా లేదా అనే అనుమానాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి.