ఇంతకీ మెహరీన్ పోస్ట్ చేసింది ఏమిటంటే.. ‘భవ్య బిష్ణోయ్ నేను కలిసి మా నిశ్చితార్థాన్ని విరమించుకోవాలనుకున్నాము. కొన్ని కారణాల వల్ల మా బంధం పెళ్లి వరకు వెళ్లడం లేదని తెలియజేస్తున్నాను. ఈ నిర్ణయం మేమిద్దరం స్నేహపూర్వకంగా ఇష్టంతో తీసుకున్నదే. ఇందులో ఎలాంటి ఒత్తిడి లేదు. ఇప్పటి నుంచి భవ్య బిష్ణోయ్‌తో గానీ, అతని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో గానీ నాకు ఎలాంటి సంబంధం లేదు.
ఈ విషయం పై ఇక నేను ఎటువంటి ప్రకటన చేయాలనుకోవడం లేదు. మీకు తెలుసు, ఒక పెళ్లి వెనుక ఎన్నో విషయాలు ఉంటాయి. దయచేసి ఇది నా పర్సనల్ విషయంగా భావించండి. అలాగే నా నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని భావిస్తున్నాను. ఇకపై నటిగానే కొనసాగాలని నిర్ణయించుకున్నాను. నా తదుపరి ప్రాజెక్ట్ ల పై ప్రస్తుతం దృష్టి పెట్టాను. అలాగే నటిగా మెప్పించేందుకు ఎంతగానో తపన పడుతున్నాను’ అంటూ మెహరీన్ ఎమోషనల్ ట్వీట్ చేసింది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. మెహ్రీన్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాల్లో “F3” ఒక్కటే చెప్పుకోదగ్గది. మెహరీన్ కి మాత్రం కొత్తగా పెద్దగా అవకాశాలు రావడం లేదు. దాంతో ఎఫ్ 3 సినిమా ఆమె కెరీర్ కి కీలకం కానుంది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాలో రెచ్చిపొయి మరీ నటిస్తోందట ఈ బ్యూటీ. అయితే ఎంత బాగా నటించినా ఈ చిత్రంతో మిల్కీ బ్యూటీ తన గ్లామర్ తో షేక్ చేస్తానంటుంది.