Annamayya Dam: ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వరదలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రకృతి వైపరీత్యాలకు మానవ తప్పిదాలు తోడుకావడంతో ఏపీకి తీరని నష్టం వాటిల్లుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జగన్ సర్కారు తప్పులను కేంద్రం సైతం చూసిచూడనట్లుగా వదిలేస్తుండటంతో ఆ ప్రభావం భవిష్యత్ తరాలపై ఉంటుందనే ఆందోళనలు కలుగుతున్నాయి.
ఇటీవల ఏపీకి వరదల వల్ల తీవ్ర నష్టం జరిగింది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి నివారణ చర్యలు చేపట్టాయి. ప్రజలను ఆదుకునేందుకు సాయం చేస్తామని ప్రకటించాయి. అయితే ఈ వరద వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమేనని కారణమనే వాదనలు తెరపైకి వస్తున్నాయి.
తాజా పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ డ్యాం సేఫ్టీ బిల్లును ప్రవేశ పెడుతూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఏపీలోని అన్నమయ్య ప్రాజెక్టుకు అసలు సామర్థ్యం కంటే కూడా ఒకటిన్నర రెట్లు వరద వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో అధికారులు గేట్లు ఎత్తలేదని తెలిపారు.
వరద ఉధృతి బాగా పెరిగిపోవడంతో చివరికి గేట్లు ఎత్తేందుకు ప్రయత్నించినా ఓ గేటు పని చేయలేదన్నారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమేనని చెప్పడమే కాకుండా అంతర్జాతీయంగా పరిశీలన జరిపితే దేశం పరువు పోతుందన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో ప్రకంపనలు రేపుతున్నాయి.
వరదల నేపథ్యంలోనే ప్రతిపక్షాలు అన్నమయ్య డ్యాం నిర్వహణపై తొలి నుంచి ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నాయి. గేట్ల నిర్వహణ పట్టించుకోలేదని, మరమ్మతుల గురించి ఆలోచించలేదని విమర్శిస్తున్నారు. వరద ముంచుకొస్తుందని తెలిసినా ఇసుక కోసం నీటిని దిగువకు విడుదల చేయలేదన్న ఆరోపణలను చేస్తున్నాయి.
మరోవైపు డ్యాం దిగువ ప్రాంత ప్రజలకు కనీస సమాచారం కూడా వెళ్లకపోవడం, వారికి అందిన సమాచారం వల్లనే గుట్టపైకి వెళ్లి మిగిలిన వారు ప్రాణాలు కాపాడుకున్నారని తెలుస్తోంది. దీంతో ఈ ప్రమాదంపై జ్యూడిషియల్ విచారణ జరపాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిపై పెద్దగా స్పందించడం లేదు.
Also Read: జగన్ యాక్షన్.. అధికారుల ఓవర్ యాక్షన్
ఇలాంటి నేపథ్యంలోనే అన్నమయ్య డ్యాం వదరల విషయంలో అంతర్జాతీయంగా పరిశీలన జరిపితే భారత్ పరువు పోతుందని గజేంద్ర షెకావత్ వ్యాఖ్యానించారు. దీనినే ప్రతిపక్షాలు సైతం కౌంటర్ చేస్తున్నారు. అంతర్జాతీయ పరిశీలన సరేగానీ కేంద్రం ఎందుకు దీనిపై విచారణ చేపట్టదంటూ ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు.
ఏపీలోని వరద నేపథ్యంలోనే అనేక ప్రాజెక్టుల నిర్వహాణలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రజల రక్షణ రీత్య కేంద్రం ప్రభుత్వమే ఏపీలోని అన్ని ప్రాజెక్టుల నిర్వాహణపై విచారణ జరిపించాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంలో కేంద్రం బాధ్యత తీసుకోకుంటే ప్రజలకు అన్యాయం చేసినట్లేనని అంటున్నారు. మరీ కేంద్రం ఈ విషయంలో జగన్ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటుందో లేదో వేచిచూడాల్సిందే..!