RRR: ఆర్​ఆర్​ఆర్ ట్రైలర్​ రిలీజ్ ఆ రోజేనట

RRR: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. టాలీవుడ్ స్టార్ హీరోల అయినా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా పాన్ ఇండియన్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్ అలానే హాలీవుడ్ యాక్టర్ ఓలివియా మోరీస్, శ్రీయ శరణ్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. వచ్చే […]

Written By: Raghava Rao Gara, Updated On : December 4, 2021 6:39 pm
Follow us on

RRR: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. టాలీవుడ్ స్టార్ హీరోల అయినా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా పాన్ ఇండియన్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్ అలానే హాలీవుడ్ యాక్టర్ ఓలివియా మోరీస్, శ్రీయ శరణ్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధంగా ఉంది ఈ చిత్రం.

RRR

Also Read: “ఆర్‌ఆర్‌ఆర్” ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్… పూనకాలకు రెడీ గా ఉండండి అంటూ

ఇప్పటికే ఈ చిత్రం ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్,టీజర్, పాటలు ప్రేక్షక అభిమానులలో ఈ మూవీ పై ఇంకాస్త భారీ అంచనాలు పెంచాయి. అయితే, ఇటీవల ఈ సినిమా ట్రైలర్​ను డిసెంబరు 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్​ డేట్​ను వాయిదా వేసినట్లు తెలిపారు. త్వరలోనే కొత్త అప్​డేట్​ ఇస్తామని తెలిపారు.

అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ ట్రైలర్​ను డిసెంబరు 9న విడుదల చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వివి దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతుండగా… ఎన్టీఆర్ కొమరం భీమ్ గా అలరించ నున్నారు.

Also Read: నీ స్థాయి వేరు… బంధుప్రీతి వదిలేయ్ రాజమౌళి!