BJP Target: 2026లో జరిగే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి అత్యంత కీలకమైన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. 2021లో బీజేపీ కేవలం 76 సీట్ల వద్దనే ఆగిపోయింది. ఈ ఎన్నికల్లో బీజేపీ తీవ్రంగా పోరాడింది. సీఎం మమతా బెనర్జీని ఓడించింది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లు సాధించలేదు. 15 ఏళ్లుగా బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ముస్లిం ఓటర్లకు అండగా ఉంటూ హిందువులకు దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఇదే మంచి అవకాశంగా భావిస్తోంది. జేపీ నడ్డా నేతృత్వంలో రాష్ట్ర వ్యూహం రూపొందించారు.
బెంగాల్ నేతలతో కీలక సమావేశం..
ఈ క్రమంలో జేపీ.నడ్డా బెంగాల్ కీలక సమావేశం నిర్వహించారు. విభేదాలు తొలగించే ప్రయత్నం చేశారు. కీలక బాధ్యలు అప్పగించారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక ఎంపీ లేదా సీనియర్ నాయకుడిని నియమించింది. బీజేపీ అధికారంలోకి వస్తే ఆయుష్మాన్ భారత్, జీ రామ్‌జీ అమలవుతాయి. ఈ అంశాన్ని బెంగాల్ ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నడ్డా మార్గదర్శకత్వంలో వచ్చిన మరో కీలకం స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూలో బీజేపీ ఓట్లు తొలగకుండా చూశారు. నవంబర్ 24న బీజేపీ మొత్తం రాష్ట్రాన్ని ఐదు కీలక జోన్లుగా విభజించింది. ప్రతీ జోన్‌కు ఒక సంఘటన కార్యదర్శిని నియమించింది. వీరు స్థానిక నాయకులను కలుపుకుని విస్తృతంగా తిరుగుతూ పనిచేస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన పవన్ రాణాకు బెంగాల్‌లో కీలక బాధ్యతలు అప్పగించారు.
బీజేపీ వ్యూహాలు..
ప్రతీ నియోజకవర్గానికి ఎంపీ లేదా సీనియర్ నాయకుడిని నియమించారు. రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా చేసి, ప్రతి జోన్‌కు సంఘటన కార్యదర్శి నియమించారు. ఢిల్లీ ఎన్నికల హీరో పవన్ రాణాను బెంగాల్‌లో బాధ్యతలు ఇచ్చారు. కోల్‌కతా, దక్షిణ బెంగాల్ (24 పర్గణాలు)లో సీట్లు పెంచాలని లక్ష్యం. 15 ఏళ్ల అధికారంలో మమతా ప్రభుత్వం ముస్లిం ఓట్లపై ఆధారపడి హిందువులను కంగోరు చేసిందని ఆరోపణ. విలేజ్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఓటర్లను ఆకర్షిస్తోంది. 2021లో బీజేపీ 76 సీట్లకు ఆగినా, ప్రభుత్వ ఏర్పాటు కలిగలేదు.
బెంగాల్‌లోనే గెలుపు అవకాశాలు..
ముఖ్యంగా బీజేపీ దృష్టి కోల్‌కతా, దక్షిణ బెంగాల్‌పై ఎక్కువగా ఉంది. నార్త్, సౌత్ 24 పరగణాల్లో 64 సీట్లు ఉంటాయి. 2016లో బీజేఈ కేవలం ఒక సీటు, 2021 ఐదు సీట్లు గెలిచింది. ఇక్కడ సీట్లు పెంచాలని బీజేపీ భావిస్తోంది. కోల్‌కతా మెట్రోపాలిటన్ ఏరియాల్లో 2016, 2021లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఈ ఏరియాను కూడా ప్రత్యేకంగా పనిచేస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ కూడా ఓటర్లను ఆకట్టుకునేందుకు విలేజ్ వలంటీర్ వ్యవస్థను అమలు చేస్తోంది. వెల్ఫేర్ కమిటీ పేరుతో వెయ్యి మందిని నియమించింది. దానిని అధిగమించి బీజేపీ అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఇక కేరళ, తమిళనాడులో బీజేపీకి బాగా టఫ్ పోటీ ఉంటుంది. అస్సోం, పుదుచ్చేరీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. మళ్లీ గెలిచే అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న ఏకైక రాష్ట్రం పశ్చిమబెంగాల్. అందుకే ఫలితాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ప్రజల అసంతృప్తి, విభేదాలు తొలగించిన నడ్డా వ్యూహం బీజేపీకి అనుకూలం. 24 పర్గణాలు, కోల్‌కతాలో సీట్లు పెరిగితే అధికార మార్పు సాధ్యమే. తృణమూల్ వెల్ఫేర్ ప్లాన్లు సవాలు, కానీ బీజేపీ కేంద్ర పథకాల ప్రచారంతో ఆధిపత్యం స్థాపించవచ్చు. ఇది 2026 ఎన్నికల్లో బీజేపీకి కీలక విజయానికి దారితీస్తుంది.