మోదీకి జై కొట్టిన సోనియా గాంధీ

కరోనా(కోవిడ్-19) పేరు చెబితినే ప్రపంచ దేశాలు బెంబెలెత్తిపోతున్నాయి. చైనాలోని వూహాన్ పుట్టిన కరోనా మహమ్మరి క్రమంగా అన్ని దేశాలకు పాకింది. భారత్ లోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో దేశమంతటా 21రోజులపాటు లాకౌడౌన్ చేస్తున్నట్లు ప్రధాని మోదీ మంగళవారం రాత్రి 8గంటలకు ప్రకటించారు. ప్రధాని నిర్ణయానికి దేశ ప్రజలంతా స్వాగతించారు. తాజాగా ప్రధాని మోదీ నిర్ణయానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మద్దతు ప్రకటించారు. దేశంలో కరోనా మహమ్మారి నియంత్రించడానికి ప్రధాని తీసుకున్న లాక్డౌన్ నిర్ణయానికి సంపూర్ణ […]

Written By: Neelambaram, Updated On : March 26, 2020 5:28 pm
Follow us on

కరోనా(కోవిడ్-19) పేరు చెబితినే ప్రపంచ దేశాలు బెంబెలెత్తిపోతున్నాయి. చైనాలోని వూహాన్ పుట్టిన కరోనా మహమ్మరి క్రమంగా అన్ని దేశాలకు పాకింది. భారత్ లోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో దేశమంతటా 21రోజులపాటు లాకౌడౌన్ చేస్తున్నట్లు ప్రధాని మోదీ మంగళవారం రాత్రి 8గంటలకు ప్రకటించారు. ప్రధాని నిర్ణయానికి దేశ ప్రజలంతా స్వాగతించారు. తాజాగా ప్రధాని మోదీ నిర్ణయానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మద్దతు ప్రకటించారు.

దేశంలో కరోనా మహమ్మారి నియంత్రించడానికి ప్రధాని తీసుకున్న లాక్డౌన్ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ గురువారం వెల్లడించారు. ఈమేరకు ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ రాశారు. కరోనా మహమ్మారి లక్షలాదిమంది జీవితాలను ప్రమాదంలో పడేసిందని పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత విపత్కర పరిస్థితిన ఎదుర్కొనేందుకు దేశం ఒక్కతాటిపై నిలవాలన్నారు. కరోనా నియంత్రణ కోసం కేంద్రం తీసుకునే అన్ని చర్యలకు కాంగ్రెస్ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని సోనియాగాంధీ లేఖలో వెల్లడించారు.

లాకౌడౌన్ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా నివారణకు కేంద్రం శాయశక్తులు కృషి చేస్తుంది. ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించడంతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలతో కేంద్ర ప్రభుత్వం కరోనా నివారణకు అన్ని చర్యలను తీసుకుంటుంది. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని ప్రభుత్వం కోరుతుంది. ప్రజల నుంచి కూడా ప్రభుత్వ చర్యలకు మద్దతు లభిస్తుంది. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా మోదీ నిర్ణయాలకు మద్దతు పలుకడంతో కేంద్రం మరింత కఠిన చర్యలకు పూనుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.