కరోనాపై పోరాటానికి విరాళం ప్రకటించిన త్రివిక్రమ్

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతోంది. కరోనా మహమ్మారి అనేక రంగాలతో పాటు చిత్ర పరిశ్రమను కూడా తీవ్రంగా దెబ్బతీసింది. ముఖ్యంగా సినీ రంగం పై ఆధారపడిన చాలా మంది ప్రత్యక్షంగా, కొందరు పరోక్షంగా ఉపాధి కోల్పోయారు. కొత్త చిత్రాల షూటింగ్స్, మరియు విడుదల నిలిపివేయడం వలన అనేక మంది ఆర్థికంగా నష్టపోయారు . ఉపాధి లేకపోవడం వలన కొందరు నిత్యవసర వస్తువులు కూడా కొనుక్కోలేని దుస్థితి దాపురించింది . ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడల్లా తన […]

Written By: Neelambaram, Updated On : March 26, 2020 2:32 pm
Follow us on

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతోంది. కరోనా మహమ్మారి అనేక రంగాలతో పాటు చిత్ర పరిశ్రమను కూడా తీవ్రంగా దెబ్బతీసింది. ముఖ్యంగా సినీ రంగం పై ఆధారపడిన చాలా మంది ప్రత్యక్షంగా, కొందరు పరోక్షంగా ఉపాధి కోల్పోయారు. కొత్త చిత్రాల షూటింగ్స్, మరియు విడుదల నిలిపివేయడం వలన అనేక మంది ఆర్థికంగా నష్టపోయారు . ఉపాధి లేకపోవడం వలన కొందరు నిత్యవసర వస్తువులు కూడా కొనుక్కోలేని దుస్థితి దాపురించింది .

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడల్లా తన వంతు బాధ్యతగా స్పందిస్తూ ఉంటారు దర్శకుడు త్రివిక్రమ్. ఈ నేపథ్యంలో కరోనా సహాయక చర్యల కోసం తెలుగు రాష్ట్రాలు చేస్తున్న పోరాటానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ‌విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ.10 లక్షల చొప్పున విరాళం అందజేస్తానని వెల్లడించారు. ఈ విరాళాలను ప్రభుత్వాలకు త్వరలోనే అందచేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన‌ చేశారు.