https://oktelugu.com/

తెలంగాణలో లాక్ డౌన్ పై కేసీఆర్ నిర్ణయమిదే

తెలంగాణలో లాక్ డౌన్ మే 30తో ముగుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశం అవుతోంది. తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ రేపటితో ముగియనుంది. మరో వైపు కరోనా కేసులు, లాక్ డౌన్ పై మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో తెలంగాణలో లాక్ డౌన్ పై కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే అధికార వర్గాల నుంచి […]

Written By:
  • NARESH
  • , Updated On : May 30, 2021 / 09:36 AM IST
    Follow us on

    తెలంగాణలో లాక్ డౌన్ మే 30తో ముగుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశం అవుతోంది. తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ రేపటితో ముగియనుంది. మరో వైపు కరోనా కేసులు, లాక్ డౌన్ పై మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో తెలంగాణలో లాక్ డౌన్ పై కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు.

    అయితే అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. తెలంగాణలో మరికొన్ని రోజులు లాక్ డౌన్ పొడిగించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా పరిస్థితులు అదుపులోనే ఉన్నప్పటికీ మరికొన్నిరోజులు లాక్ డౌన్ పొడగిస్తేనే మంచిదని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

    కేంద్రప్రభుత్వం కూడా లాక్ డౌన్ పొడిగింపుపై సూచనలు చేయడంతో కేసీఆర్ సర్కార్ ఆ దిశగా నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే లాక్ డౌన్ పై కేసీఆర్ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర వర్గాల నుంచి అభిప్రాయాన్ని తీసుకున్నారు. చాలా మంది లాక్ డౌన్ కొనసాగించాలని ఆదేశించారు. ఇప్పటికే సరాసరిన దాదాపు 3వేలకు పైగా కేసులు నమోదవుతుండడం.. బ్లాక్ ఫంగస్ బాధితులు పెరుగుతున్నందున లాక్ డౌన్ ను కొనసాగించడమే మేలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక వ్యవసాయశాఖపై కూడా కేసీఆర్ సమీక్షించనున్నారు. రైతు బంధు సాయాన్ని జూన్ 15 నుంచి అందించేందుకు రెడీ అయ్యారు. రైతుల అకౌంట్లలో జూన్ 15 నుంచి 25వరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఇక కల్తీ విత్తనాల మీద ఉక్కుపాదం మోపాలన్నారు. జిల్లాల వ్యాప్తంగా కల్తీ విత్తనాల మీద దాడులు చేయాలని కేసీఆర్ ఆదేశాలిచ్చారు. పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు.

    ప్రధానంగా కేబినెట్ లో లాక్ డౌన్ సహా రాష్ట్రంలో వ్యవసాయం పరిస్థితి. కొనసాగుతున్న ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధానికి చర్యలు తదితర అంశాలపై చర్చించనున్నారు.