https://oktelugu.com/

Rahul Gandhi: కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేనా?

Rahul Gandhi: దేశంలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించే వారు కనిపించడం లేదు. ఫలితంగా పార్టీ అన్ని ప్రాంతాల్లో వెనుకబడిపోయింది. కొన్ని స్టేట్లలో అయితే ప్రజలు పూర్తిగా మరిచిపోయారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమవుతోంది. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లోను పరాజయం చవిచూసిన పార్టీ ఇప్పటికి కూడా మేల్కోవడం లేదు. దీంతో భవిష్యత్ అంధకారంగానే కనిపిస్తోంది. నాయకత్వ సమస్య వెంటాడుతోంది. సమర్థులైన నాయకులు లేక పార్టీ డోలాయమానంలో […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 1, 2022 / 11:30 AM IST
    Follow us on

    Rahul Gandhi: దేశంలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించే వారు కనిపించడం లేదు. ఫలితంగా పార్టీ అన్ని ప్రాంతాల్లో వెనుకబడిపోయింది. కొన్ని స్టేట్లలో అయితే ప్రజలు పూర్తిగా మరిచిపోయారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమవుతోంది. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లోను పరాజయం చవిచూసిన పార్టీ ఇప్పటికి కూడా మేల్కోవడం లేదు. దీంతో భవిష్యత్ అంధకారంగానే కనిపిస్తోంది. నాయకత్వ సమస్య వెంటాడుతోంది. సమర్థులైన నాయకులు లేక పార్టీ డోలాయమానంలో పడిపోతోంది.

    Rahul Gandhi

    ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు రాహుల్ గాంధీని మళ్లీ అధ్యక్షుడిగా నియమించాలని ఒత్తిళ్లు వస్తున్న సందర్భంలో పార్టీ కూడా సానుకూలంగానే స్పందిస్తోంది. కానీ ఇప్పుడే రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా నియమిస్తే వచ్చే ఎన్నికల నాటికి పుంజుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నా పార్టీ మాత్రం ఆయన పట్టాభిషేకానికి ఇంకా సమయం ఉందని చెబుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

    Also Read: టీ కాంగ్రెస్ లో ముసలం.. రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న సీనియర్లు

    కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పంజాబ్, రాజస్తాన్, చత్తీస్ గడ్ స్టేట్లలోనే అధికారంలో ఉంది. అక్కడ కూడా అసంతృప్తుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేయాలంటే నాయకత్వ మార్పు కూడా ఓ బలంగా భావిస్తున్నా అధిష్టానం మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఎన్నికలపై ఫోకస్ పెట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది.

    త్వరలో జరిగే అయిదు స్టేట్ల ఎన్నికల నాటికి రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా చేస్తే లాభం ఉంటుందని చెబుతున్నా పార్టీ మాత్రం ఆ ఎన్నికలు జరిగిన తరువాత రాహుల్ ను అధ్యక్షుడిగా నియమించేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ముందే మేల్కొనే సంస్కృతి కాంగ్రెస్ కు లేదని చెబుతున్నారు. జరగాల్సిన నష్టం జరిగాక రాహుల్ ను అధ్యక్షుడిగా చేస్తే ఏం లాభం అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

    Also Read: 2021 రౌండప్: జగన్.. ఈ ఏడాది మాట తప్పా.. మడమ తిప్పాడు.. విసిగించాడు

    Tags