Pawan Kalyan-Vijay Deverakonda: పవన్ కళ్యాణ్ రికార్డును తుడిచిపెట్టిన విజయ్ దేవరకొండ !

Pawan Kalyan-Vijay Deverakonda: సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న ‘లైగర్’ సినిమా గ్లింప్స్‌ కి వస్తున్న రెస్పాన్స్ చూసి సినిమా వాళ్ళే షాక్ అవుతున్నారు. విజయ్ దేవరకొండకు బాక్సాఫీస్ వద్ద నిజంగా ఇంత మార్కెట్ ఉందా ? అని నోరెళ్లబెడుతున్నారు. అసలు విజయ్ కి ఎంత మార్కెట్ ఉంది అనేది ఎవరికీ క్లారిటీ లేదు. విజయ్ గత సినిమాల దెబ్బకు విజయ్ మార్కెట్ […]

Written By: Shiva, Updated On : January 1, 2022 11:18 am
Follow us on

Pawan Kalyan-Vijay Deverakonda: సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న ‘లైగర్’ సినిమా గ్లింప్స్‌ కి వస్తున్న రెస్పాన్స్ చూసి సినిమా వాళ్ళే షాక్ అవుతున్నారు. విజయ్ దేవరకొండకు బాక్సాఫీస్ వద్ద నిజంగా ఇంత మార్కెట్ ఉందా ? అని నోరెళ్లబెడుతున్నారు. అసలు విజయ్ కి ఎంత మార్కెట్ ఉంది అనేది ఎవరికీ క్లారిటీ లేదు. విజయ్ గత సినిమాల దెబ్బకు విజయ్ మార్కెట్ పై అనేక అనుమానాలు క్రియేట్ అయ్యాయి.

Pawan Kalyan-Vijay Deverakonda

ఇలాంటి నేపథ్యంలో ‘లైగర్’ సినిమా గ్లింప్స్‌ రిలీజ్ అయింది. అయితే, గ్లింప్స్‌ కు వస్తోన్న రెస్పాన్స్ చూసి ఒడియమ్మా బడవా ఇదేందయ్య ఇదీ, ‘లైగర్’ సినిమా పై ఇంత క్రేజ్ ఉందా ఏమిటి ? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇండియా రేంజ్ లో ‘లైగర్’ గ్లింప్స్‌ అదరగొట్టేస్తోంది. ఇది మాత్రం అసలు ఎవరూ ఊహించలేదు.

న్యూ ఇయర్ కానుకగా వచ్చిన లైగర్ టీజర్ మొత్తానికి ఇండియన్ రికార్డులను తుడిచేస్తూ ముందుకు దూసుకువెళ్తుంది. భీమ్లా నాయక్ పేరు మీదున్న 8.49 మిలియన్ వ్యూస్ రికార్డును కేవలం 7 గంటల్లోనే ‘లైగర్’ సినిమా గ్లింప్స్‌ తుడిచిపెట్టింది. పైగా 22 గంటల్లోనే 15 మిలియన్ వ్యూస్ ను సాధించింది. పైగా యూ ట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్ అవుతుంది.

Also Read: ఒళ్ళు దగ్గర పెట్టుకొండంటూ పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చిన నటి మాధవీలత?

ఇదంతా చూస్తుంటే విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇప్పటి వరకు విజయ్ కి 50 కోట్ల మార్కెట్ ఉంది అని ఓ అంచనా మాత్రమే ఉంది. అది కూడా గీత గోవిందం సినిమా 60 కోట్లకు పైగా షేర్ ను రాబట్టింది కాబట్టి. అయితే, ఈ సినిమా తప్ప మరో సినిమా ఏదీ 40 కోట్లు కూడా వసూలు చేయలేదు.

చివరకు ‘అర్జున్ రెడ్డి, టాక్సీవాలా’ లాంటి హిట్ సినిమాలు కూడా కేవలం 20 కోట్ల దగ్గరే ఆగిపోయాయి. అందుకే, విజయ్ దేవరకొండ మార్కెట్ పై మొదటి నుంచీ అనేక అనుమానాలు ఉన్నాయి. కానీ, ‘లైగర్’ సినిమా గ్లింప్స్‌ ఆ అనుమానాలను పటాపంచలు చేసింది. ఈ సినిమాకు ఏకంగా 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని ప్రచారం జరుగుతుంది.

Also Read: అత్యంత దురదృష్టవంతులైన నటులు వీళ్ళే !

Tags