ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అరెస్టు పెద్ద దూమారం లేపుతోంది. సాధారణంగా వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై ఇలాంటి కేసులు పెట్టి హడావుడి చేసి భయపట్టిన విషయం అందరికీ తెలిసింది. గతంలో టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, ధూళిపాళ్లలను జైలుకు పంపడం బెయిల్ రాకుండా చేయడం.. ఆ తరువాత యధావిధిగా ఉండడంతో చూస్తే రాజకీయ ప్రతీకారం కోసమేనన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు సొంత పార్టీ నేత.. అదీ ఎంపీగా ఉన్న వ్యక్తిపై కేసులు పెట్టడమే కాకుండా ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న వాదన కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యవహారం సుప్రీం కోర్టు వరకు వెళ్లడంతో అక్కడి తీర్పు ఏ విధంగా ఉంటుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.
ప్రభుత్వంపై ధూషనలు చేసినందుకు ఎంపీపై సుమోటాగా తీసుకొని కేసు నమోదు చేశారు. ఇందులో అదనపు డీఐజీ ఫిర్యాదుదారుడిగా ఉండి రఘురామకృష్ణం రాజును అరెస్టు చేశారు. అయితే ఆయనను రమేశ్ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశాలచ్చినా సీఐడీ పోలీసులు పట్టించుకోలేదు. సమయం లేదని చెప్పి జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్సలు చేసి నేరుగా జైలుకు పంపించారు. అయితే జీజీహెచ్ ఇచ్చిన నివేదిక కూడ అనుమానాస్పదంగా ఉందని అంటున్నారు.
తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించాని ఎంపీ స్వయంగా న్యాయవాదికి ఫిర్యాదు చేశారు. కానీ ఆసుపత్రి నివేదిక మాత్రం కాళ్లకు వాపులు వచ్చాయని, అవి కొట్టి దెబ్బలు కావని ఇచ్చింది. దీంతో ఈ నివేదికపై కూడా పలు అనుమానాలు వస్తున్నాయని అంటున్నారు. మరోవైపు జీజీహెచ్ లో రఘురామ చికిత్స వీడియో తీయాలని చెప్పినా పట్టించుకోలేదు. పైగా కోర్టుకు మరో ఛాన్స్ లేకుండా రాత్రిక రాత్రే రిపోర్టు సమర్పించారు. అయతే రమేశ్ ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ వచ్చేరిపోర్టులో అసలు విషయం బయటపడుతుందనే ఇదంతా చేశారా..? అని చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా ఆ ఆసుపత్రి టీడీపీకి చెందిందని ప్రచారం కూడా చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఎంపీనీ అరెస్టు చేసిన తరువాత సోషల్ మీడియాలో వైసీపీకి చెందిన ఓ సామాజిక వర్గం ఆయనకు కోటింగ్ ఇస్తున్నారని ప్రచారం చేశారు. అనుకున్నట్లుగానే తెల్లారేసరికి ఆయన తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని న్యాయవాదికి ఫిర్యాదు చేశారు. అయితే పరిస్థితి సుప్రీం కోర్టు వరకు వెళ్లేసరికి టీడీపీ నేత చంద్రబాబునాయుడే ఇదంతా చేయిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ఏదీ ఏమైనా ఈ వ్యవహారం సుప్రీం కోర్టులో ఉంది. అక్కడ వచ్చే తీర్పుపైనే అందరి దృష్టి ఉంది.