
తౌక్టే తుఫాను ధాటికి ముంబై సమీపంలో అరేబియా సముద్రంలో రెండు ఓడలు కొట్టుకుపోయాయి. ఇందులో 410 మంది గల్లంత్వగా ఇప్పటి వరకు 146 మందిని రక్షించినట్లు భారత నావికాదళం మంగళవారం తెలిపింది. మిగతా వారిని సైతం రక్షించేందుకు సహాయక చర్యలు చేపడుతున్నట్లు నేవీ పేర్కొంది. తౌక్టే అతి తీవ్ర తుఫానుగా మారగా భారీగా గాలులు వీశాయి. దీంతో ముంబై తీరంలో ఉన్న రెండు ఓడలు కొట్టుకుపోయాయి. సమాచారం అందుకున్న నేవీ తన మూడు యుద్ధ నౌకలను మోహరించింది. మంగళవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 146 మందిని నేవీ రక్షించింది.