నితీష్ ను సీఎం సీటు నుంచి తప్పిస్తారా..?

చాలా రోజుల తరువాత బీహార్ రాష్ట్ర రాజకీయాలు మరోసారి వార్తల్లోకి వచ్చాయి.2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ గద్దెనెక్కింది. ఆ పార్టీ అధినేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కొనసాగుతున్నారు. అయితే మెజారిటీ స్థానాలు గెలవకపోయినా జేడీయూ అధికారంలోకి రావడానికి బీజేపీ కారణమైంది. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నితీశ్ కుమార్ కు సీఎం పదవి కట్టబెట్టామని బీజేపీ నాయకులు వారికి వారే పొగడుకున్నారు. తాజాగా నితీశ్ సీటుకు ఎసరు పడే […]

Written By: NARESH, Updated On : May 18, 2021 10:46 am
Follow us on

చాలా రోజుల తరువాత బీహార్ రాష్ట్ర రాజకీయాలు మరోసారి వార్తల్లోకి వచ్చాయి.2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ గద్దెనెక్కింది. ఆ పార్టీ అధినేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కొనసాగుతున్నారు. అయితే మెజారిటీ స్థానాలు గెలవకపోయినా జేడీయూ అధికారంలోకి రావడానికి బీజేపీ కారణమైంది. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నితీశ్ కుమార్ కు సీఎం పదవి కట్టబెట్టామని బీజేపీ నాయకులు వారికి వారే పొగడుకున్నారు. తాజాగా నితీశ్ సీటుకు ఎసరు పడే అవకాశముందన్న వార్తలు జోరందుకున్నాయి.

2020 ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకులు తమకు మెజారిటీ సీట్లు వచ్చినా.. పొత్తులో భాగంగా జేడీయూ అధికారంలో ఉంటుందని ప్రచారం చేశారు. అనుకున్నట్లుగానే బీజేపీ 74 సీట్లలో విజయం సాధించింది. జేడీయూ 43 స్థానాల్లో గెలుపొందింది. అయితే మాట ఇచ్చిన ప్రకారం నితీష్ కుమార్ కు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టారు బీజేపీ నాయకులు. రెండేళ్లు ఎలాంటి రాజకీయ వివాదాలు లేకుండా ప్రభుత్వం కొనసాగింది.

తాజాగా కేంద్రంలో మంత్రివర్గ విస్తరణపై ప్రచారం జోరందుకుంది. అయితే మంత్రి వర్గంలోకి నితీష్ కుమార్ ను తీసుకుంటారని అంటున్నారు. బీహార్ లోని బీజేపీ నాయకులు ఇక తాము అధికారంలో ఉండాలని పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో నితీశ్ ను మంత్రివర్గంలోకి తీసుకొని ముఖ్యమంత్రి పీఠంపై బీజేపీ నేత కూర్చునే విధంగా ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం బయటికి చెప్పకపోయినా లోలోపల మాత్రం తతంగం ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఒకవేళ నితీశ్ కేంద్రమంత్రి పదవి తీసుకోకపోతే ఆయన స్థానంలో చిరాగ్ పాశ్వాన్ ను రంగంలోకి దించనున్నట్లు సమాచారం. నితీష్ కుమార్ కు చిరాగ్ అంటే చికాకు. దీంతో నితీశ్ మాట వినకపోతే ఆయనను దించి బీజేపీ అధికారంలోకి రావడానికి ఎత్తులు వేస్తున్నట్లు సమాచారం. మెజారిటీ సీట్లు దక్కించుకొని అధికారంలో లేకపోయేసరికి బీజేపీ నాయకులు కొంత నిరాశ చెందినట్లుంది. అందుకే అధికారం కోసం బీజేపీ నాయకులు ఏం చేస్తారో చూడాలి..