రఘురామా.. నీ పోస్టు పోవడం ఖాయమేనా?

నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కాళ్ల కిందకు నీళ్లు వస్తున్నట్టు తెలుస్తోంది. కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న ఆయన పోస్టుకు ఎసరు వస్తోందట.. త్వరలోనే రఘురామకు గట్టి ఎదురుదెబ్బ తగులబోతోందని సమాచారం. రఘురామకృష్ణం రాజును వైసీపీ నుంచి బహిష్కరించిన వెంటనే ఆయన బీజేపీలో చేరాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ వైసీపీ అధిష్టానం వ్యూహాత్మకంగానే పార్టీ నుంచి రఘురామను సస్పెండ్ చేయకుండా నాన్చుతోంది. అదే సమయంలో ఆయన ఎంపీ హోదాను తొలిగించి ఆయనను డమ్మీ […]

Written By: NARESH, Updated On : August 17, 2020 7:39 pm
Follow us on


నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కాళ్ల కిందకు నీళ్లు వస్తున్నట్టు తెలుస్తోంది. కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న ఆయన పోస్టుకు ఎసరు వస్తోందట.. త్వరలోనే రఘురామకు గట్టి ఎదురుదెబ్బ తగులబోతోందని సమాచారం.

రఘురామకృష్ణం రాజును వైసీపీ నుంచి బహిష్కరించిన వెంటనే ఆయన బీజేపీలో చేరాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ వైసీపీ అధిష్టానం వ్యూహాత్మకంగానే పార్టీ నుంచి రఘురామను సస్పెండ్ చేయకుండా నాన్చుతోంది. అదే సమయంలో ఆయన ఎంపీ హోదాను తొలిగించి ఆయనను డమ్మీ చేసే ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

Also Read: జగన్ ది బుర్రా.. లేక ఖర్ఖానాన?

బీజేపీతో వైసీపీ అధిష్టానానికి దగ్గరి సంబంధాలున్నాయి. ఈ క్రమంలోనే రాఘురామకృష్ణం రాజు తన ఎంపీ సీటును కోల్పోయేలా చేసేందుకు వైసీపీ పట్టుదలగా ఉన్నట్టు సమాచారం. వైసీపీ పూర్తిగా రాజకీయంగా రఘురామను చావుదెబ్బ తీసే ప్రణాళికను రచిస్తున్నట్టు సమాచారం.

ప్రస్తుతం రఘురామకృష్ణంరాజు లోక్ సభ స్పీకర్ తోపాటు బీజేపీ పెద్దలతో సన్నిహితంగా మెలుగుతున్నారు. అయితే రఘురామ కంటే ఒక రాష్ట్రాన్ని పాలించే వైసీపీ పార్టీకే బీజేపీ అధిష్టానం ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలోనే ఒక్క రఘురామ లాంటి ఎంపీ కంటే.. వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలే ముఖ్యమని భావిస్తోంది. వైసీపీకి ఆరుగురు రాజ్యసభ ఎంపీలు ఉండడం కూడా బీజేపీ ఇటువైపే మొగ్గానికి కారణమవుతోంది.

Also Read: జగన్ దగ్గరకు సీక్రెట్ లిస్ట్..! వణికిపోతున్నారు

అంతేకాకుండా వైసీపీ, బీజేపీ ఉమ్మడి శత్రువు టీడీపీ. ఇప్పుడు రఘురామ టీడీపీ తరుఫునే రాజకీయం చేస్తున్నారు. దీంతో బీజేపీ నాయకులు వైసీపీ కోరిక మేరకు రఘురామ ఎంపీ సీటుపై స్పీకర్ ద్వారా వేటు వేసేందుకు డిసైడ్ అయ్యారని ఢిల్లీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. రాబోయే కొద్దిరోజుల్లోనే రఘురామకృష్ణం రాజు తన ఎంపీ స్థానాన్ని కోల్పోబోతున్నారని వైసీపీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే రఘురామ డమ్మీ అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.