మిస్టర్ కూల్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడా?

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్.ధోని అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున సాయంత్రం అనుహ్యంగా ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ప్రకటించి అందరిని షాక్ కు గురిచేశాడు. అయితే ధోని మాత్రం తన రిటైర్మెంట్ పై చాలా కూల్ గా ఇన్ స్ట్రాగ్రాములో పెట్టుచేసి క్రికెట్లో తనకున్న ‘మిస్టర్ కూల్’ నామాన్ని సార్థకం చేసుకున్నాడు. ధోని రిటైర్మెంట్ కావడంతో ఆయన తర్వాత ఏం చేయబోతున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది. Also Read: […]

Written By: Neelambaram, Updated On : August 18, 2020 11:43 am
Follow us on


భారత మాజీ కెప్టెన్ ఎంఎస్.ధోని అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున సాయంత్రం అనుహ్యంగా ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ప్రకటించి అందరిని షాక్ కు గురిచేశాడు. అయితే ధోని మాత్రం తన రిటైర్మెంట్ పై చాలా కూల్ గా ఇన్ స్ట్రాగ్రాములో పెట్టుచేసి క్రికెట్లో తనకున్న ‘మిస్టర్ కూల్’ నామాన్ని సార్థకం చేసుకున్నాడు. ధోని రిటైర్మెంట్ కావడంతో ఆయన తర్వాత ఏం చేయబోతున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది.

Also Read: రఘురామా.. నీ పోస్టు పోవడం ఖాయమేనా?

మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ ఆడే సమయంలోనే రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తాడనే ప్రచారం జోరుగా సాగింది. అయితే అప్పుడు ధోని బీజీగా ఉండటంతో వాటిపై ఆయన పెద్దగా స్పందించలేదు. అయితే తాజాగా ధోని రిటైర్మెంట్ ను ప్రస్తావిస్తూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమ్మణ్య స్వామి చేసిన సంచలన ట్వీట్ చేశాడు. ‘మహేంద్ర సింగ్‌ ధోనీ క్రికెట్ నుంచి మాత్రమే రిటైర్ అయ్యారని.. మిగతా వాటి నుంచి కాదని.. కష్టాలను ఎదురించే సత్తా ఆయనకు ఉందని.. టీమిండియాకు ధోని అందించిన నాయకత్వతీరు ప్రజలకు ఎంతో అవసరముందని.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ధోని పోటీచేయాలి’ అంటూ ట్వీట్ చేశాడు.

Also Read: కరోనా ఎఫెక్ట్.. ఇంటికే గణేశుడు పరిమితం..!

ఎంపీ సుబ్రమ్మణ్యస్వామి ధోనిపై చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. రాజకీయ, క్రీడావర్గాల్లో ఆయన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. త్వరలో రానున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ధోనీ బరిలోకి దిగుతాడని పుకార్లు విన్పిస్తున్నాయి. ధోనిని బీజేపీలోకి రప్పించేందుకు ఇప్పటికే అధిష్టానం ప్రయత్నం చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ధోనీ గతంలోనే కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యాడని పలువురు గుర్తు చేస్తున్నారు. కాగా బీజేపీ ఎంపీ తనపై చేసిన ట్వీట్ పై ధోనిపై ఎలా రియాక్టవుతాడో వేచి చూడాల్సిందే..!