Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయ హ‌త్య‌లు కొన‌సాగుతాయా?

Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయాలు ప‌క్క‌దారి ప‌డుతున్నాయి. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు పెద్దపీట వేస్తూ ఎదుటి వారిని అంత‌ర్మ‌థ‌నంలో ప‌డేస్తున్నారు. దీంతో వారిలో రాక్ష‌స‌త్వాన్ని బ‌య‌ట‌పెడుతున్నారు. మ‌నిషిలో మ‌రో కోణం దాగి ఉంద‌ని నిరూపిస్తున్నారు. ఇందులో భాగంగానే హ‌త్యా రాజ‌కీయాలు కూడా కొన‌సాగుతున్నాయి. క‌డ‌ప ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కూడా ఇదే కోణంలో జరిగిన‌ట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో మ‌రిన్ని రాజ‌కీయ హ‌త్య‌లు జ‌రుగుతాయ‌నే అనుమానాలు వ‌స్తున్నాయి. రాష్ట్రంలో కొన‌సాగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌తో అంద‌రిలో […]

Written By: Srinivas, Updated On : February 27, 2022 11:59 am
Follow us on

Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయాలు ప‌క్క‌దారి ప‌డుతున్నాయి. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు పెద్దపీట వేస్తూ ఎదుటి వారిని అంత‌ర్మ‌థ‌నంలో ప‌డేస్తున్నారు. దీంతో వారిలో రాక్ష‌స‌త్వాన్ని బ‌య‌ట‌పెడుతున్నారు. మ‌నిషిలో మ‌రో కోణం దాగి ఉంద‌ని నిరూపిస్తున్నారు. ఇందులో భాగంగానే హ‌త్యా రాజ‌కీయాలు కూడా కొన‌సాగుతున్నాయి. క‌డ‌ప ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కూడా ఇదే కోణంలో జరిగిన‌ట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో మ‌రిన్ని రాజ‌కీయ హ‌త్య‌లు జ‌రుగుతాయ‌నే అనుమానాలు వ‌స్తున్నాయి.

Andhra Pradesh

రాష్ట్రంలో కొన‌సాగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌తో అంద‌రిలో ఆశ్చ‌ర్యం వేస్తోంది. ముక్కుసూటి త‌నం అనుకుంటున్నా మూర్ఖ‌త్వం అని తెలియ‌డం లేదు. గ‌తంలో ప్రతిప‌క్ష నేత చంద్ర‌బాబు పై చేసిన ఆరోప‌ణ‌ల‌తో ఆయ‌న కంట త‌డి పెట్టుకోవ‌డం తెలిసిందే. దీంతో ఏపీలో రాజ‌కీయాలు ప‌క్క‌దారి ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. విమర్శ‌ల ప‌ర్వం నుంచి దాడుల వ‌ర‌కు కూడా వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం.

Also Read: ఆ రోజే ఏపీ మంత్రివ‌ర్గ స‌మావేశం.. బ‌డ్జెట్‌లో ఆ రంగాల‌కే అధిక కేటాయింపులు..!

ఏపీలో రాజ‌కీయ వైష‌మ్యాలు పెరుగుతున్నాయి. రాజ‌కీయ పార్టీల్లో వైరుధ్యాలు క‌నిపిస్తున్నాయి. వైఎస్ వివేకా హ‌త్య‌ను సీబీఐ ద‌ర్యాప్తు చేస్తోంది. ఇందులో వైఎస్ కుటుంబీకులే నిందితులుగా తేల‌డంతో ఎలా ముందుకు వెళుతుందో తెలియ‌డం లేదు. వారిని అరెస్టు చేస్తారా? లేక కేసును పక్క‌దారి ప‌ట్టిస్తారా? అనేది తేలాల్సి ఉంది. దీంతో రాజ‌కీయ హ‌త్య‌ల ప‌రంప‌ర కొన‌సాతుంద‌నే వాద‌న‌లు కూడా వినిపిస్తున్నాయి.

ఎట్టి ప‌రిస్థితుల్లో కూడా అధికారం చేప‌ట్టాల‌నే ఉద్దేశంతోనే రాజ‌కీయ పార్టీలు త‌మ వైఖ‌రిని మార్చుకుంటున్నాయి. విలువ‌ల‌కు వ‌లువ‌లు ఒలిచి నైతిక‌త‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. అందుకే ఈ విచిత్ర ప‌రిస్థితులు వ‌స్తున్నాయి. రాబోయే రోజుల్లో నేత‌ల మ‌ధ్య విభేదాలు ముదిరి మ‌రిన్ని హ‌త్య‌లకు దారి తీస్తాయ‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. దీనికి విరుగుడు ఉండాలంటే కేంద్రం సీబీఐ చేత చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు.

Also Read: బయ్యారం కోసం తెలంగాణ సర్కార్ ఉద్యమం

Tags