AP Employees Strike: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. పీఆర్సీ విషయంలో ప్రారంభమైన గొడవ సమ్మె వరకు దారి తీస్తోంది. ప్రభుత్వం కూడా వినేలా లేదు. దీంతో ఇద్దరి మధ్య వివాదాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పాలన అటకెక్కింది. నేడు ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు చలో విజయవాడ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. దీంతో ఈనెల 7 నుంచి సమ్మె చేపడతామని ప్రకటించింది. దీంతో ఉద్యోగులు తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వానికి మరో హెచ్చరిక జారీ చేసినట్లు అయింది.
పీఆర్సీ సాధన కోసం ఈనెల 5 నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం చేపడుతున్నట్లు చెబుతున్నారు. ఉద్యోగుల డిమాండ్లు తీర్చకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని దుయ్యబడుతున్నారు. దీంతో చలో విజయవాడ విజయవంతంగా నిర్వహించి ప్రభుత్వానికి తమ ప్రభావం చూపించిన ఉద్యోగులు త్వరలోనే ప్రభుత్వం మెడలు వంచి తీరుతామని చెబుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల డిమాండ్లు మాత్రం తీరేలా ప్రభుత్వం దిగి వస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి.
మెల్లమెల్లగా అన్ని ఉద్యోగ సంఘాలు సమ్మెకు మద్దతు తెలుపుతున్నాయి. ఆర్టీసీ, విద్యుత్ సంస్థలు కూడా ఉద్యోగులతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వం దిగి వచ్చే వరకు విశ్రమించేది లేదని తెగేసి చెబుతున్నారు. పీఆర్సీ ని తాము చెప్పిన విధంగా మార్చాలని డిమాండ్ పెరుగుతోంది. ఉద్యోగులు సూచిస్తున్న మూడు డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతోనే వారు సమ్మెకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: AP Employees: ఉప్పెనలా వచ్చిన ఉద్యోగులు..చేతులెత్తేసిన పోలీసులు
ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్పాలని చూస్తున్నారు. ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చే వరకు ఊరుకునేది లేదని చూస్తున్నారు. దీంతో ఉద్యోగుల సత్తా ఏమిటో చలో విజయవాడ ద్వారా నిరూపించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు తెచ్చినా తమ మాట నెగ్గించుకున్నారు. ప్రభుత్వానికి పరోక్షంగా హెచ్చరిక చేశారు. ప్రభుత్వం మాత్రం తన పంతం వీడటం లేదు. ఉద్యోగులు కూడా తమ పలుకుబడి ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వంపై యుద్ధం చేసేందుకే నిర్ణయించుకుంటున్నారు.
సమ్మెతో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలిగినా తమ బాధ్యత లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వమే తమ కోరికలు తీర్చకపోవడంతోనే సమ్మెకు వెళుతున్నామని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వమే దిగి వచ్చి ప్రజల ఇబ్బందులను గుర్తించి సమ్మెను అనివార్యం చేయకుండా చేయాల్సిన అవసరం ఉందని గుర్తించడం లేదు. అందుకే ఉద్యోగులు సమ్మెకు వెళితే ప్రభుత్వానికే మచ్చ వస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వంలో మార్పు రావాలని సూచిస్తున్నారు.
Also Read: AP Employees Issue: తగ్గేదే లే అంటూనే తగ్గిన ఉద్యోగులు.. ప్రభుత్వంతో చర్చలకు జై..