https://oktelugu.com/

పయ్యావుల పార్టీ మారబోతున్నారా?

2019 ఎన్నికల తర్వాత టీడీపీకి ఏపీలో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ఎన్నికల్లో ఫ్యాన్ వీచిన ప్రభంజనంలో టీడీపీ కేవలం 23సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వైసీపీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి రావడంతో సీఎం జగన్ కు ఎదురులేకుండా పోతుంది. ఇటీవలే సీఎంగా జగన్ ఏడాదికాలం పూర్తి చేసుకున్నారు. సంవత్సర కాలంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ బెస్ట్ సీఎంగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఎంగా పదవీ చేపట్టిన తొలినాళ్లలో జగన్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వాటి నుంచి […]

Written By: , Updated On : July 30, 2020 / 01:09 PM IST
Follow us on


2019 ఎన్నికల తర్వాత టీడీపీకి ఏపీలో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ఎన్నికల్లో ఫ్యాన్ వీచిన ప్రభంజనంలో టీడీపీ కేవలం 23సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వైసీపీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి రావడంతో సీఎం జగన్ కు ఎదురులేకుండా పోతుంది. ఇటీవలే సీఎంగా జగన్ ఏడాదికాలం పూర్తి చేసుకున్నారు. సంవత్సర కాలంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ బెస్ట్ సీఎంగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఎంగా పదవీ చేపట్టిన తొలినాళ్లలో జగన్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వాటి నుంచి త్వరగానే కోలుకుని ముందుకెళుతున్నారు.

Also Read: ఆంధ్రాలో మూడో ప్రత్యామ్నాయం సాధ్యమేనా?

ఓవైపు సంక్షేమం.. మరోవైపు ప్రత్యర్థి పార్టీలను బలహీనపర్చేలా వ్యూహాలతో జగన్ ముందుకెళుతున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సేలు జగన్ కు జై కొడుతున్నారు. మరికొందరు వైసీపీలోకి చేరేందుకు రెడీ అవుతున్నారు. దీంతో బాబుకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా జగన్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక చంద్రబాబు నాయుడి హయాంలో మంత్రులుగా చేసినంత ఒక్కొక్కరుగా కటకటలా పాలవుతుండటంతో టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ ముఖ్యనేతలంతా సైలంటైపోతున్నారు.

టీడీపీకి నమ్మకమైన నేతగా ఉన్న పయ్యావుల కేశవ్ తాజాగా పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. పయ్యావుల కేశవ్ ఎప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ ప్రతిపక్షంలోనే ఉండాల్సి వస్తోంది. 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పయ్యావుల కేశవ్ ఓటమి పాలయ్యారు. దీంతో చంద్రబాబు నాయుడు నాడు ఆయనకు ఎమ్మెల్సీ పదవీని కట్టబెట్టారు. ఇక 2019 ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ గెలిచినా పార్టీ అధికారంలో రాలేదు. కిందటి ఎన్నికల్లో రాయలసీమ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో పయ్యావుల కేశవ్ ఒకరు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఆయనకు పీఏసీ చైర్మన్ పదవీని కట్టబెట్టారు.

Also Read: బీజేపీ-జనసేన పొత్తులో సీఎం అభ్యర్థి ఎవరు?

పీఏసీ చైర్మన్ ఉన్న పయ్యావుల కేశవ్ ప్రభుత్వం చేసే ప్రతీరూపాయిని పరిశీలించి ఎండగట్టాల్సిందిపోయి మౌనంగా ఉంటున్నారు. దీంతో పార్టీలో పయ్యావుల తీరుపై చర్చ నడుస్తోంది. సీమలో జగన్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ వైసీపీని మరింత బలోపేతం చేస్తుండటంతో టీడీపీ కోలుకునే పరిస్థితి లేదని పయ్యవుల భావిస్తున్నారట. దీంతో ఆయన కూడా టీడీపీ జెండా పీకేసీ వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే టాక్ విన్పిస్తోంది. అందుకే పయ్యావుల కొద్దిరోజులుగా మౌనంగా ఉంటున్నారని టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. వైసీపీకి చెందిన ఓ ఎంపీతో పయ్యావుల సన్నిహితంగా ఉంటున్నారట.

దీంతో పయ్యావుల కూడా పార్టీ మారుతారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఆయన కూడా పార్టీ మారితే సీమలో టీడీపీ మరింత గడ్డు పరిస్థితులు ఎదురవడం ఖాయమనే వాదనలు విన్పిస్తున్నాయి. దీంతో చంద్రబాబు నాయుడు పయ్యావులకు పార్టీ మారకుండా ఉండడానికి ఎలాంటి భరోసా కల్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది.