https://oktelugu.com/

తెలంగాణలో కరోనా.. ఆశ్చర్యపోయే లెక్కలు

తెలంగాణలో కరోనా వ్యాప్తిపై కేసీఆర్ సర్కార్ ఎప్పుడూ నేరుగా చెప్పలేదు. హైకోర్టు హెచ్చరికలతో తాజాగా బులిటెన్ లో మార్పులు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆశ్చర్యకర లెక్కలు వెలుగుచూస్తున్నాయి. తెలంగాణలో కరోనా పాజిటివ్ గా తేలిన వారిలో 65 శాతం మందికి పైగా 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గలవారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకు పరీక్షించిన వారిలో 65.7 మంది 21-50 సంవత్సరాల వయస్సులో ఉన్నారని ఆరోగ్య అధికారులు తెలిపారు. 60 ఏళ్లు పైబడిన […]

Written By:
  • NARESH
  • , Updated On : July 30, 2020 / 12:55 PM IST
    Follow us on


    తెలంగాణలో కరోనా వ్యాప్తిపై కేసీఆర్ సర్కార్ ఎప్పుడూ నేరుగా చెప్పలేదు. హైకోర్టు హెచ్చరికలతో తాజాగా బులిటెన్ లో మార్పులు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆశ్చర్యకర లెక్కలు వెలుగుచూస్తున్నాయి. తెలంగాణలో కరోనా పాజిటివ్ గా తేలిన వారిలో 65 శాతం మందికి పైగా 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గలవారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకు పరీక్షించిన వారిలో 65.7 మంది 21-50 సంవత్సరాల వయస్సులో ఉన్నారని ఆరోగ్య అధికారులు తెలిపారు. 60 ఏళ్లు పైబడిన వారు.. 10 ఏళ్లలోపు వారు తక్కువ సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారు.21-40 ఏళ్లలోపు వారు 47.1 శాతం, 41 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులు 18.6 శాతం ఉన్నారు. మొత్తం తొమ్మిది వయస్సు వర్గాలలో, 31-40 సంవత్సరాల సమూహం ఎక్కువగా వైరస్ కు ప్రభావితమైంది. 25 శాతం కేసులు వీరివి ఉన్నాయి. ఇక తెలంగాణలో కరోనా వల్ల 300 మంది చనిపోయారు. వీరిలో 192మంది (64శాతం) ఇతర వ్యాధులేవి లేని పూర్తి ఆరోగ్యవంతులు కావడం గమనార్హం. మృతుల్లో 108మంది (36శాతం) మంది మాత్రమే ఇతర వ్యాధులుండి చనిపోయారు.

    Also Read: ఆంధ్రాలో మూడో ప్రత్యామ్నాయం సాధ్యమేనా?

    తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి పూర్తి వివరాలు బులిటెన్ లో ఉండాలని ఆదేశించింది. తద్వారా కరోనా బారిన ఎవరు పడుతున్నారన్నది తెలుస్తుందని.. అవగాహన పెరుగుతుందని తేలింది. దీంతో తెలంగాణ సర్కార్ బులిటెన్ మార్చేసింది. ఈ బులిటెన్ ద్వారా యువకులు జాగ్రత్తగా ఉండాలని.. సురక్షితంగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఆరోగ్య అధికారులు విడుదల చేసిన వివరణాత్మక మీడియా బులెటిన్ లో ఈ మేరకు క్లారిటీ వచ్చింది. పరీక్షించిన వారిలో పాజిటివ్ 14.7 మంది 51 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గలవారని తెలిసింది.

    వైరస్ బారిన పడిన వారిలో 10.9 శాతం మంది 60 ఏళ్లు పైబడినవారని గణాంకాలు చెబుతున్నాయి. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల శాతం 3.4 కాగా, 11 నుంచి 20 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు 5.3 శాతం ఉన్నారు. బులెటిన్ ద్వారా పిల్లలు.. వృద్ధులకు కరోనా వ్యాపించకుండా హాని కలిగించడం లేదని తేలింది. మహిళల కంటే ఎక్కువ మంది పురుషులు పాజిటివ్‌ గా తేలుతున్నారని బులెటిన్ చూపిస్తోంది. అన్ని పాజిటివ్ కేసులలో పురుషులు 65.6 శాతం ఉండగా, మిగిలిన వారు మహిళలు.

    Also Read: కరోనా ఎఫెక్ట్.. విద్యార్థులకు గుడ్ న్యూస్

    తెలంగాణ సర్కార్ మృతదేహాల లెక్కలను దాస్తోందన్న ప్రచారం సాగుతోంది. ఎర్రగడ్డలో రోజుకు 50మందికి దహన సంస్కారాలు చేస్తూ బులిటెన్ లో మాత్రం కరోనా మృతులను 10కి మించకుండా వేస్తుండడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. మొత్తంగా తెలంగాణ బులిటెన్ లో ఏదో మతలబు ఉందన్న అనుమానాలను ప్రతిపక్షాలు చేస్తున్నాయి.