సీఎం జగన్ కు నిమ్మగడ్డ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడా?

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శిగా పునర్నియామకమయ్యారు. కొద్దిరోజుల క్రితం జగన్ సర్కార్ నిమ్మగడ్డను పదవీ నుంచి తొలగించి కొత్తవారిని నియమించింది. దీనిపై నిమ్మగడ్డ న్యాయపోరాటం చేయడంతో ఈ వివాదంకాస్తా సీఎం జగన్ వర్సెస్ నిమ్మగడ్డ అన్నట్లుగా మారింది. హైకోర్టులో నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు వచ్చినా ప్రభుత్వం మాత్రం ఆయన తిరిగి నియమించలేదు. దీంతో హైకోర్టు సూచన మేరకు నిమ్మగడ్డ గవర్నర్ ను సంప్రదించారు. గవర్నర్ ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డను తిరిగి […]

Written By: Neelambaram, Updated On : August 4, 2020 5:54 pm
Follow us on


నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శిగా పునర్నియామకమయ్యారు. కొద్దిరోజుల క్రితం జగన్ సర్కార్ నిమ్మగడ్డను పదవీ నుంచి తొలగించి కొత్తవారిని నియమించింది. దీనిపై నిమ్మగడ్డ న్యాయపోరాటం చేయడంతో ఈ వివాదంకాస్తా సీఎం జగన్ వర్సెస్ నిమ్మగడ్డ అన్నట్లుగా మారింది. హైకోర్టులో నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు వచ్చినా ప్రభుత్వం మాత్రం ఆయన తిరిగి నియమించలేదు. దీంతో హైకోర్టు సూచన మేరకు నిమ్మగడ్డ గవర్నర్ ను సంప్రదించారు. గవర్నర్ ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డను తిరిగి ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శిగా తిరిగి పునర్నియమిస్తున్నట్లు గురువారం అర్ధరాత్రి జీవో జారీ చేసిన సంగతి తెల్సిందే.

Also Read: బీటెక్ రవి రాజీనామా వెనుక అసలు కారణం ఇదేనా?

దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శిగా తిరిగి బాధ్యతలు చేపట్టారు. దీంతో సీఎం జగన్ విషయంలో నిమ్మగడ్డ పైచేయి సాధించారనే టాక్ విన్పిస్తుంది. అయితే నిమ్మగడ్డ ఇష్యూ సుప్రీం కోర్టులో ఉండటంతో తీర్పు ఎలా ఉన్నా ప్రస్తుతం నిమ్మగడ్డ జగన్ సర్కార్ విషయంలో ఏవిధంగా ముందుకెళుతారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే నిమ్మగడ్డ సైతం ఆయన తిరిగి నియామకమైన రోజునే అధికార పార్టీ నేతలు రాజ్యాంగ వ్యవస్థలను ఎలా కించపరిచేలా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని ఆయన సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీ నేతల తీరుపై సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేయడం మరింత ఆసక్తిని రేపుతోంది.

ఏపీలో ప్రస్తుతం కరోనా విజృంభిస్తుంది. దీంతో నిమ్మగడ్డ ప్రస్తుతానికి ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కొనసాగిన ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. ఆయన పదవీకాలం వచ్చే మార్చితో ముగియనుంది. దీంతో ఆయన పదవీకాలం మరో ఏడునెలలు మాత్రం ఉండనుంది. కరోనా కారణంగా ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు కన్పించడం లేదు. అయితే మధ్యలో నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పలుచోట్ల ఎన్నికలు ఏకగ్రీవంకాగా వీటిపై రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

Also Read: రాజధానుల రాజకీయ రగడ మొదలైయింది

గతంలో జగన్ ప్రభుత్వంపై తనపై కక్ష సాధింపు చర్యలకు నిమ్మగడ్డ రిటర్న్ గిప్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఏకగ్రీవమైన పంచాయతీలపై నిమ్మగడ్డ నిర్ణయం తీసుకోనున్నారు. ఏకగ్రీవ పంచాయతీలన్నీ దాదాపు అధికార పార్టీ ఖాతాలోకి వెళ్లాయి. దీంతో ఈ ఎన్నికలను నిమ్మగడ్డ తిరిగి రీ షెడ్యూల్ చేసే అవకాశముందనే టాక్ విన్పిస్తుంది. గతంలో ఏకగ్రీవ స్థానాలకు మళ్లీ నిర్వహించాల్సి వస్తే అది సీఎం జగన్ కు కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉండనుంది. దీంతో నిమ్మగడ్డ ఏకగ్రీవ పంచాయతీలను రద్దుచేసి మరోసారి ఎన్నికలకు రీ షెడ్యూల్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. దీంతో నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏవిధంగా ముందుకెళుతారనేది ఆసక్తికరంగా మారింది.