https://oktelugu.com/

బాబుకు టీడీపీ నేతల ‘వెన్నుపోటు’!

రాజకీయాల్లో చంద్రబాబు చర్రిత 40ఇయర్స్ ఇండస్ట్రీ.. అత్యధిక కాలం సీఎంగా, ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్న నేతల్లో చంద్రబాబు ఒకరు. అధికారంలో ఉన్నా.. లేకున్నా చంద్రబాబు పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవడం చంద్రబాబు దిట్ట అని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అలాంటి చంద్రబాబును ప్రత్యర్థి పార్టీలు ఒక విషయంలో నిత్యం ఇరుకున పెడుతుంటాయి. చంద్రబాబు తన మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారనే విమర్శలు చేస్తుంటాయి. నిజానికి బాబు తనకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 4, 2020 / 06:11 PM IST
    Follow us on


    రాజకీయాల్లో చంద్రబాబు చర్రిత 40ఇయర్స్ ఇండస్ట్రీ.. అత్యధిక కాలం సీఎంగా, ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్న నేతల్లో చంద్రబాబు ఒకరు. అధికారంలో ఉన్నా.. లేకున్నా చంద్రబాబు పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవడం చంద్రబాబు దిట్ట అని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అలాంటి చంద్రబాబును ప్రత్యర్థి పార్టీలు ఒక విషయంలో నిత్యం ఇరుకున పెడుతుంటాయి. చంద్రబాబు తన మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారనే విమర్శలు చేస్తుంటాయి. నిజానికి బాబు తనకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారో లేదో తెలియదుగానీ జనాల్లోకి వెళ్లిపోయింది.

    Also Read: సీఎం జగన్ కు నిమ్మగడ్డ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడా?

    ఎన్టీఆర్ వీరాభిమానులు, ప్రత్యర్థి పార్టీల నేతలు ఇప్పటికే చంద్రబాబును వెన్నుపోటుదారుడిగానే చిత్రీకరిస్తుంటాయి. చంద్రబాబు సైతం ఈ విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చిన దాఖలాల్లేవు. చంద్రబాబు అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయనను ప్రత్యర్థులు ఈ విషయంలోనే టార్గెట్ చేస్తుంటారు. కుర్ర సీఎం జగన్, వైసీపీ నేతలు పలుమార్లు అసెంబ్లీలో చంద్రబాబుకు వెన్నుపోటు రాజకీయాల్లో పేటెంట్ హక్కు ఉందని అది తమ వల్ల కాదంటూ సెటైర్లు వేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అయితే ఇప్పుడు మరోసారి టీడీపీలో వెన్నుపోటు రాజకీయాలపై చర్చ నడుస్తోంది.

    చంద్రబాబుతో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న తెలుగు తమ్ముళ్లు ఆయనకే చెక్ పెట్టేందుకు రెడీ అవుతున్నారని టాక్ విన్పిస్తోంది. గత ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓటమిపాలయ్యాక చంద్రబాబు పరపతి దారుణంగా పడిపోయింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సీఎం జగన్ కు జై కొట్టారు. మరికొందరు కూడా అదే దారిలో ఉన్నారనే టాక్ విన్పిస్తుంది. ఇదిలా ఉంటే ఏపీలో మూడు రాజధానుల విషయంలో చంద్రబాబుకు దూకుడుగా వెళుతున్నారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని(అమరావతి) డిమాండ్ తో టీడీపీ నేతలందరికీతో కలిసి ఆయన కూడా రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే చంద్రబాబుకు తమను సంప్రదించకుండా రాజీనామా నేతలు ప్రకటించడంతో తెలుగు తమ్ముళ్లు ఆయనకు జలక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. .

    చంద్రబాబు అమరావతి రాజధాని డిమాండ్ కు కౌంటర్ గా తెలుగు తమ్ముళ్లు ఇటీవల కర్నూలు రాజధానిని తెరపైకి తీసుకొచ్చారు. సీఎం జగన్ అసెంబ్లీని రద్దుచేసి ప్రజాక్షేత్రంలో అమరావతి రాజధాని అంశాన్ని తేల్చుకోవాలని చంద్రబాబు సవాల్ విసురుతున్నారు. అయితే బాబుకు సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమవుతున్నారు. రాజీనామాల విషయంలో చంద్రబాబుతో కలిసి నడించేందుకు ససేమిరా అంటున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులో ప్రజలంతా ఆర్థికంగా చితికిపోయి ఉన్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేసే ముందుకెళితే మళ్లీ గెలువడం కష్టమని అంటున్నారు.

    Also Read: రాజధానుల రాజకీయ రగడ మొదలైయింది

    టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చంద్రబాబుకు అందుబాటులో లేకుండా తమ ఫోన్లను స్వీచ్ ఆఫ్ చేసుకుంటున్నారు. తాము రాజీనామా చేసేది లేదని అవసరమైతే మీరు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లండి అంటూ బాబుకు తెగేసి చెబుతున్నారని టాక్ విన్పిస్తుంది. అమరావతి రాజధాని వల్ల టీడీపీ ఒక ప్రాంతంలో నెగ్గుతుందని.. మిగిలిన ప్రాంతాల్లో గెలిచే అవకాశం లేదని బాబుకు తేల్చి చెబుతున్నారట. తెలుగు తమ్ముళ్లను నమ్ముకొని బాబు రాజీనామా అంశాన్ని తెరపైకి తెస్తే తీరా కీలక సమయంలో వారంతా ఆయనకు వెన్నుపొటు పొడిచేందుకు సిద్ధమవుతుండటం చర్చనీయాంశంగా మారింది

    ప్రస్తుత పరిస్థితుల్లో తమ్ముళ్లు చంద్రబాబుతో కలిసి నడిచే ప్రసక్తి లేకపోవడంతో రాజీనామాల అంశాన్ని బాబు ఏవిధంగా కొండెక్కిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే వెన్నుపొటు విషయంలో తమ్ముళ్లు చంద్రబాబును మించిపోయారే.. అనే సైటర్లు ఏపీలో విన్పిస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో చంద్రబాబు తమ్ముళ్లను ఎలా కట్టడి చేస్తారో వేచి చూడాల్సిందే..!