https://oktelugu.com/

పాపకు మేకప్ ఒక్కటే కాదు, టెక్కు కూడా ఎక్కువే !

‘ఆర్ఎక్స్ 100’ అనే సినిమాలో ఆడదానిలో ఎంత కసి ఉంటుందో చాల సహజంగా చేసి చూపించింది ‘పాయల్ రాజ్‌పుత్‘. ఆ సినిమా కథను బట్టి అందాల ఆరబోతలో ఏ మాత్రం వెనకాడకుండా తనకున్న యావత్తు సౌదర్యాన్ని మొత్తం ఒక్క షోకే ప్రదర్శించేసింది. దెబ్బకు సినిమా సూపర్ హిట్ అయింది. పాప కెరీర్ పీక్ లోకి వెళ్ళింది. పెద్ద సినిమాల పేర్లల్లో పాయల్ పాప పేరు బాగా వినిపించేది ఆ మధ్య. కట్ చేస్తే.. రెండేళ్లు పూర్తయిపోయాయి. స్టార్ […]

Written By:
  • admin
  • , Updated On : August 4, 2020 / 05:41 PM IST
    Follow us on


    ‘ఆర్ఎక్స్ 100’ అనే సినిమాలో ఆడదానిలో ఎంత కసి ఉంటుందో చాల సహజంగా చేసి చూపించింది ‘పాయల్ రాజ్‌పుత్‘. ఆ సినిమా కథను బట్టి అందాల ఆరబోతలో ఏ మాత్రం వెనకాడకుండా తనకున్న యావత్తు సౌదర్యాన్ని మొత్తం ఒక్క షోకే ప్రదర్శించేసింది. దెబ్బకు సినిమా సూపర్ హిట్ అయింది. పాప కెరీర్ పీక్ లోకి వెళ్ళింది. పెద్ద సినిమాల పేర్లల్లో పాయల్ పాప పేరు బాగా వినిపించేది ఆ మధ్య. కట్ చేస్తే.. రెండేళ్లు పూర్తయిపోయాయి. స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతుందనుకున్న పాయల్ చివరికీ ఐటెమ్ సాంగ్స్ కి ఒక ఆప్షన్ లా మిగిలిపోయింది.

    Also Read: ఎక్స్ క్లూజివ్: ప్రభాస్ ‘రాధే శ్యామ్’ స్టోరీ సీక్రెట్స్ !

    పోనీ స్టార్ హీరోల సినిమాల్లో అన్నా పాయల్ కి స్పెషల్ ఐటమ్ సాంగ్ వస్తున్నాయా అంటే.. సెకెండ్ లెవల్ హీరోల సినిమాల్లో అడుగుతున్నారు. మొత్తానికి ఈ హాట్ బ్యూటీ కెరీర్ టాలీవుడ్ లో ఇక క్లోజ్ అయినట్లే. ప్రస్తుతం చిన్నాచితకా హీరోలు కూడా పాయల్ ను హీరోయిన్ లా ట్రీట్ చేయడం లేదు. ఐటెమ్ క్వీన్ గానే చూస్తున్నారు. పాయల్ కి ఉన్న గ్లామర్ కి, బాడీకి మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ రోల్స్ చేయాలి. ఆమెకున్న టాలెంట్ కి స్టార్ హీరోయిన్ అవ్వాలి. కానీ, పాయల్ కెరీర్ ప్లానింగ్ లో పూర్తిగా ఫెయిల్ అయింది. మనలో ఎంత ఉంది అని కాదు, ఉన్న దాన్ని ఎంత ఉపయోగించుకుంటున్నాం అనే సూత్రాన్ని ఈ భారీ అందాల తార తెలుసుకోలేకపోయింది. కెరీర్ ను నాశనం చేసుకుంది.

    Also Read: మోహన్‌బాబు ఇంటికెళ్ళి బెదిరించింది వారే !

    రవితేజ – రమేష్ వర్మ కలయికలో వస్తోన్న సినిమాలో కూడా తాజాగా పాయల్ ను తప్పించారు. నిజానికి పాయల్ చేతిలో ఉన్న చెప్పుకోతగ్గ సినిమా ఇది ఒక్కటే. ఇప్పుడు అది కూడా పోయింది. దానికి తోడు వచ్చిన ఐటమ్ సాంగ్స్ ను కూడా చేయను అంటుందట. అంతా అయిపోయాక ఇప్పుడు బాధ పడి ఆ సాంగ్స్ ను కూడా మానుకుంటే.. కొన్నాళ్ళకు అవి కూడా రాకుండా పోతాయని పాయల్ కి ఎప్పుడు అర్ధమవుతుందో. ఏమైనా ఈ ముద్దుగుమ్మ ఇలా ఐటమ్ సాంగ్స్ కూడా పనికిరాకుండా పోతుందని ఎవ్వరూ ఊహించలేదు. అన్నట్టు తన పరిస్థితి గురించి బయటపడకుండా, పాయల్ బాగానే కవర్ చేస్తోందండోయ్. మంచి కంటెంట్ ఉన్న పాత్రలు చేయాలనే.. ఇంతవరకూ ఏ సినిమా ఒప్పుకోవలేదు అంటుంది. పాపకి మేకపే కాదు, టెక్కు కూడా ఎక్కువే.