మమతా బెనర్జీ కల నెరవేరుతుందా?

జాతీయ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పలు ప్రాంతాల్లో తమ పట్టు నిలుపుకునే క్రమంలో దూసుకుపోతోంది. బెంగాల్ లో మూడోసారి అధికారం చేపట్టిన సీఎం మమతా బెనర్జీ సైతం మూడో కూటమి ఏర్పాటుకు శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అన్ని పక్షాలను ఏకం చేసే విధంగా పావులు కదుపుతున్నారు. ఢిల్లీ వేదికగా థర్డ్ ఫ్రంట్ ఏర్పడాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమె ఢిల్లీ పర్యటనకు పూనుకున్నట్లు […]

Written By: Srinivas, Updated On : July 26, 2021 9:47 am
Follow us on

జాతీయ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పలు ప్రాంతాల్లో తమ పట్టు నిలుపుకునే క్రమంలో దూసుకుపోతోంది. బెంగాల్ లో మూడోసారి అధికారం చేపట్టిన సీఎం మమతా బెనర్జీ సైతం మూడో కూటమి ఏర్పాటుకు శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అన్ని పక్షాలను ఏకం చేసే విధంగా పావులు కదుపుతున్నారు. ఢిల్లీ వేదికగా థర్డ్ ఫ్రంట్ ఏర్పడాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమె ఢిల్లీ పర్యటనకు పూనుకున్నట్లు సమాచారం.

ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాలను సమర్థంగా తిప్పికొట్టగలిగే సత్తా మమతలో ఉన్నట్లు ఇతర పక్షాల నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె మూడో కూటమికి నేతృత్వం వహించాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో మమతా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి నేతలను కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మోడీ, షాలను ఢిల్లీ నుంచి పంపాలని అన్ని రకాలుగా ప్రయత్నాుల ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కూడా కలవనున్నారు.

త్వరలో జరిగే ఐదు స్టేట్ల ఎన్నికలు సమీస్తున్న తరుణంలో మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటనపై ప్రాధాన్యత సంతరించుకుంది. విపక్షాలను ఏం చేసి బీజేపీపై ఎధురు దాడి చేసే విధంగా తయారు చేసేలా మమత ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సైతం ఇదే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఆయన ఇప్పటికే రాహుల్ గాంధీ, శరత్ పవార్ వంటి నేతలను కలిసి మూడో కూటమి యత్నాలను ముమ్మరం చేసినట్లు చెబుతున్నారు.

ఉత్తరప్రదేశ్ లో బీజేపీని దెబ్బతీయాలని ప్రణాళిక రచిస్తున్నారు. యూపీలో మోడీని కట్టడి చేయగలిగితే బీజేపీని దెబ్బతీయడం సులువవుతుందని ఆలోచనగా పెట్టుకున్నారు. అందుకే మమత బెనర్జీ తన ప్రయత్నాలకు మార్గాలు వెతుకుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రయత్నిస్తున్నారు. మమత ఢిల్లీ పర్యటనపై పెద్ద ఆశలే పెట్టుకున్నారు.