KCR’s slogan : జై తెలంగాణ పోయి.. జై భారత్ వచ్చే.. కేసీఆర్ స్వాభిమానమే పాయే..

KCR’s slogan : ‘జై తెలంగాణ’ ఈ పదం వింటేనే ఒక రకమైన గూస్ బాంబ్స్.. ఈ పదానికి ఉన్న శక్తి అంతా ఇంతా కాదు.. ఈ నినాదమే ఆంధ్ర నేతలను పరిగెత్తించింది.. ఆంధ్రులను తరిమికొట్టేలా చేసింది. ఢిల్లీ మెడలు వంచింది. తెలంగాణ కల సాకారమైంది. ఇంతటి బలమైన నినాదాన్ని ఖమ్మం గోదారిలో కలిపేశాడు కేసీఆర్.. ‘జై తెలంగాణ వదిలేసి .. జై భారత్’ అంటూ నినదించారు. కేసీఆర్ చివరి స్లోగన్ ‘జై తెలంగాణ’ అని సభకు […]

Written By: NARESH, Updated On : January 18, 2023 7:02 pm
Follow us on

KCR’s slogan : ‘జై తెలంగాణ’ ఈ పదం వింటేనే ఒక రకమైన గూస్ బాంబ్స్.. ఈ పదానికి ఉన్న శక్తి అంతా ఇంతా కాదు.. ఈ నినాదమే ఆంధ్ర నేతలను పరిగెత్తించింది.. ఆంధ్రులను తరిమికొట్టేలా చేసింది. ఢిల్లీ మెడలు వంచింది. తెలంగాణ కల సాకారమైంది. ఇంతటి బలమైన నినాదాన్ని ఖమ్మం గోదారిలో కలిపేశాడు కేసీఆర్.. ‘జై తెలంగాణ వదిలేసి .. జై భారత్’ అంటూ నినదించారు. కేసీఆర్ చివరి స్లోగన్ ‘జై తెలంగాణ’ అని సభకు వచ్చిన లక్షలాది మంది నినదించడానికి సిద్ధమైన వేళ కేసీఆర్ నుంచి వచ్చిన ‘జై భారత్’ పదం అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

తెలంగాణం అంటే ఒక స్వాభిమానం.. 60 ఏళ్ల తెలంగాణ కల సాకారమైన వేళ ఒక విజయవంతమైన నినాదంగా మారింది. అయితే కేసీఆర్ తెలంగాణ వదిలి జాతీయ రాజకీయాల బాటపట్టారు. తెలంగాణలో రెండు సార్లు గెలిచిన సమరోత్సాహంతో ఇప్పుడు ఢిల్లీ బాట పడుతున్నారు. వెంట ఇద్దరు ముగ్గురు సీఎంలను వెంటపట్టుకొని మోడీపై యుద్ధానికి బయలు దేరుతున్నాడు.. అయితే ఈ ప్లేవర్ లో కేసీఆర్ మిస్ అయ్యేదల్లా ఏంటంటే.. అది తెలంగాణ స్వాభిమానమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇన్నాల్లు ‘జై తెలంగాణ ’ నినాదమే కేసీఆర్ ను ఈ రాష్ట్రంలో నిలిపింది. ఆయన ఉనికిని చాటింది. ఆ నినాదంతోనే జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీని దూరం జరిపారు తెలంగాణ ప్రజలు. ఆంధ్రా పార్టీలైన టీడీపీ, వైసీపీ సహా అందరినీ సాగనంపారు. అలాంటి బలమైన వాదనను వదిలేసిన కేసీఆర్ పెద్ద మిస్టేక్ చేశారని గులాబీ నేతలు, ప్రజలే అనుకుంటున్న పరిస్థితి.

ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ ఏంటని అంటే ‘టీఆర్ఎస్’ అంటున్నారు. బీఆర్ఎస్ ను ఓన్ చేసుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ అన్నది ప్రజల్లో లేదని.. ఆ నినాదం తమ ఓటమికి దారితీస్తుందని అంటున్నారు.

ప్రజల్లో సెంటిమెంట్ ఉన్నన్నీ నాళ్లు కేసీఆర్ ఆడింది ఆట పాడింది పాటగా మారింది. కానీ ఇప్పుడు ఆ స్వాభిమానం వదిలేసి దేశ రాజకీయాల బాట పడుతున్న కేసీఆర్ కు ఈ ‘జై భారత్’ నినాదం ఎంతమేరకు కలిసివస్తుందో వేచిచూడాలి.